హోమ్ /వార్తలు /National రాజకీయం /

Chandrababu Naidu: చంద్రబాబు కంటతడి.. టీడీపీ కీలక నిర్ణయం.. ఆ సమావేశాలు బహిష్కరణ

Chandrababu Naidu: చంద్రబాబు కంటతడి.. టీడీపీ కీలక నిర్ణయం.. ఆ సమావేశాలు బహిష్కరణ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP Assembly: తన కుటుంబం, భార్యపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభకు వస్తానంటూ.. సభ నుంచి వెళ్లిపోయారు.

  ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ, శానసమండలి సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు. సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ (tdp) శాసనసభాపక్షం నిర్ణయించింది. ఈ రోజు అసెంబ్లీ వేదికగా జరిగిన పరిణామాలు.. అనంతరం మీడియా సమావేశంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కంటితడి పెట్టుకోవడంతో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తన కుటుంబం, భార్యపై వైసీపీ (ysrcp) నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు (Chandrababu)  ఆరోపించారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభకు వస్తానంటూ.. సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. తన కుటుంబం, భార్యపై వైసీపీ నేతలు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడాన్ని తట్టుకోలేకపోతున్నానని కన్నీరు పెట్టుకున్నారు. ఏపీలో గౌరవ సభ కాస్త కౌరవ సభగా మారిపోయిందని విమర్శించారు. చంద్రబాబు మీడియా సమావేశం అనంతరం.. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ, శాసనమండలి సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.

  ఇదిలా ఉంటే.. తాను చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశానని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. అసలు తాను ఆమె గురించి ఏ రకమైన ప్రస్తావన తీసుకురాలేదని వివరించారు. బాబాయ్ సంగతి, గొడ్డలి గురించి, తల్లి గురించి, చెల్లి గురించి చర్చ జరగాలని చంద్రబాబు అన్నారని.. ఆ సమయంలో తాము కూడా వంగవీటి రంగా హత్య, మాధవరెడ్డి మరణంపై కూడా చర్చ జరగాలని అన్నామని అంబటి రాంబాబు అన్నారు. ఇందులో చంద్రబాబు భార్యను అవమానించడమే ప్రస్తావన ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. తాము మాట్లాడిన మాటలను టీడీపీ వాళ్లు ఏవేవో ఊహించుకుంటే.. అందుకు తమకేం సంబంధమని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

  Revanth Reddy: హైకమాండ్ ముఖ్యనేత ప్రశ్న.. రేవంత్ రెడ్డి నిర్ణయాలు మారనున్నాయా ?

  K Chandrashekar Rao: వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి.. కేసీఆర్ లెక్కేంటి ?

  ఓ వైపు తనకు పదవులు అక్కర్లేదని చెబుతున్న చంద్రబాబు.. మళ్లీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి తిరిగి వస్తానని అనడం వెనుక అర్థం ఏంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబుకు పదవి మాత్రమే ముఖ్యమని.. పదవి కోసం ఆయన ఏమైనా చేస్తారని అన్నారు. ప్రజల నుంచి తిరస్కరణకు గురవుతున్న చంద్రబాబు.. వారి తప్పుదోవ పట్టించేందుకు భార్య, కొడుకును అడ్డుపెట్టుకోవాలని చూడటం దుర్మార్గమని అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రతి చోట తిరస్కరణకు గురవుతున్న చంద్రబాబు.. ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇందులో భాగంగానే తప్పు తమపై నెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, AP Assembly, Chandrababu Naidu

  ఉత్తమ కథలు