వైసీపీ పప్పు బ్యాచ్.. ఇవిగో సాక్ష్యాలు.. టీడీపీ ఎదురుదాడి..

నారా లోకేష్‌పై వైసీపీ నేతలు అసెంబ్లీ వేదికగా ఎద్దేవా చేయడంతో టీడీపీ ఎదురు దాడికి సిద్ధమైంది. లోకేష్‌కు మంగళగిరి అనడం రాదని, మందలగిరి అని.. చంద్రబాబు మందబుద్ధి కొడుకు అయ్యారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అనడంతో టీడీపీ తన అస్త్రాలకు పదును పెట్టింది.

news18-telugu
Updated: December 11, 2019, 7:56 AM IST
వైసీపీ పప్పు బ్యాచ్.. ఇవిగో సాక్ష్యాలు.. టీడీపీ ఎదురుదాడి..
జగన్, చంద్రబాబు
  • Share this:
నారా లోకేష్‌పై వైసీపీ నేతలు అసెంబ్లీ వేదికగా ఎద్దేవా చేయడంతో టీడీపీ ఎదురు దాడికి సిద్ధమైంది. లోకేష్‌కు మంగళగిరి అనడం రాదని, మందలగిరి అని.. చంద్రబాబు మందబుద్ధి కొడుకు అయ్యారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అనడంతో టీడీపీ తన అస్త్రాలకు పదును పెట్టింది. తమ నేత తెలుగును ఎద్దేవా చేసేముందు మీ నేతల తెలుగు తీరు ఎలా ఉందో చూసుకోండి అంటూ ఓ వీడియోను పోస్టు చేసింది. వైసీపీ నేతలు పలు సందర్భాల్లో మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ రూపొందించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్న ‘ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్..’ అన్న వ్యాఖ్యలను జోడిస్తూ సీఎం జగన్, మంత్రి కన్నబాబు తదితరులు నోరుజారిన వ్యాఖ్యలతో వీడియో రూపొందించింది. అంతేకాదు.. #YSPappuBatch అన్న హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో జోరుగా వైరల్ అవుతోంది.First published: December 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>