అసెంబ్లీ కౌన్సిల్ ఛైర్మన్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు

చేతుల్లో కాగితాలు చించివేసి, అర చేతులు చూపించాలి అని వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

news18-telugu
Updated: December 11, 2019, 12:26 PM IST
అసెంబ్లీ కౌన్సిల్ ఛైర్మన్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు
సైకిల్ (టీడీపీ గుర్తు)
  • Share this:
ఏపీ అసెంబ్లీ కౌన్సిల్ చైర్మన్ ని కలిశారు టీడీపీ నేతలు. టీడీపీ ఎమ్మెల్సీలంతా శాసనమండలి చీఫ్ మార్షల్, ఇతర మార్షల్స్ అనుచిత ప్రవర్తనపై పిర్యాదు చేశారు. వీరిలో టీడీపీ మహిళ ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. తమ పట్ల అమర్యాదగా అసభ్యంగా మార్షల్స్ ప్రవర్తించారన్నారు మహిళా ఎమ్మెల్సీలు. గేట్ మూసివేసి తమ చేతుల్లో కాగితాలు చించివేసి, అర చేతులు చూపించాలి అని వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చీఫ్ మార్షల్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని టీడీపీ మహిళ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.

కౌన్సిల్‌ ఛైర్మన్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు


ఈ మేరకు కౌన్సిల్ చైర్మన్ కి లేఖ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్సీలు. కొన్ని మీడియా ఛానెల్స్ ను సభ ప్రసారాలకు అనుమతించక పోవడంపై ఫిర్యాదు చేశారు. రెండు సభలు ప్రత్యేకమైనవి, వాటి విధి నిర్వహణ ప్రత్యేకంగా ఉంటుంది, నిబంధనలు, సంప్రదాయాలు ప్రత్యేకమన్నారు. సభాపతులు వేరువేరుగా ఉన్నారన్నారు. మండలి ప్రసారాలకు కొన్ని ఛానెల్స్ ని అనుమతించక పోవడం సమంజసం కాదన్నారు. కాబట్టి తక్షణమే శాసనమండలి ప్రసారాలకు అన్ని ఛానెల్స్ ని అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి అని కౌన్సిల్ చైర్మన్ కు కోరారు టీడీపీ ఎమ్మెల్సీలు.
First published: December 11, 2019, 12:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading