టీడీపీ - జనసేన పొత్తుపై టీజీ వెంకటేష్ కామెంట్స్.. సీట్ల లెక్కలు బయటకు...

టీడీపీ - జనసేన మధ్చ పొత్తుచర్చల అవసరం ఏముందని? మార్చిలో ఏకంగా సీట్ల పంపకాల మీద చర్చలు జరపొచ్చంటూ టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: January 23, 2019, 3:12 PM IST
టీడీపీ - జనసేన పొత్తుపై టీజీ వెంకటేష్ కామెంట్స్.. సీట్ల లెక్కలు బయటకు...
చంద్రబాబు, పవన్ కల్యాణ్(ఫైల్ ఫోటో)
  • Share this:
(సయ్యద్ అహ్మద్, అమరావతి నుంచి న్యూస్‌18 కరస్పాండెంట్)

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన మరోసారి కలిసి పోటీ చేయడంపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. ఇప్పటికే జనసేనాని పవ‌న్‌పై విమర్శలు వద్దని సీఎం చంద్రబాబు టీడీపీ నేతలకు స్పష్టం చేయగా... ఇవాళ టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్... ‘జనసేనతో చర్చలతో పనేముంది? ఏకంగా మార్చిలో సీట్ల చర్చలే జరుగుతాయంటూ చేసిన వ్యాఖ్యలు ఇరుపార్టీల పొత్తును మరోసారి నిర్ధారించేలా ఉన్నాయి. ఏపీలో జనసేనతో మరోసారి కలిసి పోటే చేసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనిపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనసేనతో మేం కలిస్తే జగన్ కు బాధ ఎందుకని తాజాగా ప్రశ్నించిన సీఎం చంద్రబాబు.. తర్వాత అదే ఒరవడిని కొనసాగిస్తూ పార్టీ నేతలకు సైతం పొత్తు సంకేతాలు ఇస్తున్నారు.

janasena chief pawan kalyan reaction on chandrababu comments | జనసేనకు జనమే బలం.. ఏ పార్టీతోనూ కలవబోమన్న పవన్

పవన్ కళ్యాణ్, చంద్రబాబునాయుడు (File)ఇవాళ సీఎం చంద్రబాబును ఉండవల్లిలోని నివాసంలో కలిసిన టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్... పొత్తు ఖాయమే అన్న దిశగా సంకేతాలు ఇచ్చారు. కలిసి పోటీ చేసి విషయంపై చర్చలేముంటాయి, ఇప్పటికే తాము కలిసే ఉన్నాం, మార్చిలో సీట్ల సర్దుబాటుపై చర్చలుంటాయని స్పష్టం చేశారు. అదే సమయంలో సీఎం సీటు కోసం తాను కోరుకోనంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాన్ని కూడా టీజీ గుర్తుచేశారు. టీజీ వ్యాఖ్యల్ని అటు పార్టీ తరఫున కానీ, ప్రభుత్వం తరఫున కానీ ఎవరూ ఖండించకపోవడం ఇరు పార్టీల మధ్య పొత్తును నిర్ధారించేలా ఉందని చెప్తున్నారు.

టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్
టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్


అటు జనసేన నేతలు ఈ వ్యవహారంపై వెంటనే స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. గతంలో ఒంటరిగానే పోటీ చేస్తామని, కమ్యూనిస్టులు మినహా ఎవరితోనూ పొత్తులుండబోవని పవన్ స్పష్టం చేశారు. కానీ తాజాగా టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్న పొత్తు కామెంట్స్ పై పవన్ కానీ ఆ పార్టీ నేతలు కానీ స్పందించడం లేదు. దీంతో పొత్తు వ్యవహారంపై సరైన సమయంలో ఇరుపార్టీలు అధికారికంగా స్పందించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జనసేనకు అనుకూలంగా ఉన్న మీడియాలో మాత్రం జనసేనకు 50 అసెంబ్లీ, 10 ఎంపీ సీట్లు టీడీపీ ఆఫర్ చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి
First published: January 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading