• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • TDP CIRCULATION MESSAGE THAT ANDHRA PRADESH CM YS JAGANMOHAN REDDY GONE MISSING WHILE CORONA CASES RAISING IN THE STATE FULL DETAILS HERE PRN

Andhra Pradesh: సీఎం జగన్ మిస్సింగ్.. వెతికిపెట్టాలంటున్న లోకేష్, నిజమేనన్న RRR

సీఎం జగన్, లోకేష్ (ఫైల్)

కరోనా విజృంభణ కొనసాగుతున్నా.. ఏపీలో మాత్రం పొలిటికల్ వార్ కు బ్రేక్ పడటం లేదు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తున్నా మరోవైపు రాజకీయ వేడి మాత్రం కొనసాగుతోంది. కరోనాను సెంట్రిక్ గా ఆరోపణలు, ప్రత్యారోపణలు.. మాటల యుద్ధాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కరోనా విజృంభిస్తున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నాయి. కరోనా కేసులు, మరణాల లెక్కల్లో తేడాలున్నాయని, కరోనా వేరియంట్ విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ మండిపడుతోంది. ఇది కచ్చితంగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యమేనని.. కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేననేది టీడీపీ వాదన. మరోవైపు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా సీఎంపై విమర్శల దాడి పెంచారు. ఇంత జరుగుతున్నా సీఎం జగన్ బయటకురావడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. అంతేకాదు సీఎం జగన్ కనిపించడం లేదంటూ ట్వీట్ చేసి వాతావరణాన్ని మరింత వేడెక్కించారు.

    లోకేష్ ఏమన్నారంటే.. “కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాతో గర్భిణి, క‌డుపులో బిడ్డ కూడా మృతి చెందింది. చేతగాని సీఎం వైఎస్ జగన్ వలనే ఇలాంటి హృదయ విదారకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బెడ్లు, ఆక్సిజన్ లేక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా తాడేపల్లి నీరో చక్రవర్తి గడప దాటడం లేదు. జ‌నానికి నేనున్నాను అని హామీ ఇచ్చి నేడు క‌నిపించ‌కుండా పోయాడు. నేను విన్నాను అని అరిచి చెప్పిన జగ‌న్ రెడ్డి, రాష్ట్రంలో క‌రోనాతో మ‌ర‌ణిస్తున్న వారి ఆర్త‌నాదాలు వినిపించుకోవ‌డం లేదు.” అని ట్వీట్ చేశారు.




    ఇది చదవండి: ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ కు బ్రేక్.. మళ్లీ ఎప్పుడంటే..!


    ఇక రచ్చబండ పేరుతో సీఎం జగన్, ప్రభుత్వంపై, వైసీపీ నేతలపై మండిపడుతున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు... సీఎం జగన్ కనిపించడం లేదన్నారు. చివరిసారిగా తాడేపల్లిలో కనిపించారని.. ఆ తర్వాత ఆచూకీ లేదని ఎద్దేవా చేశారు. పాదయాత్ర సమయంలోనే ప్రజలకు దర్శనమిచ్చిన ముఖ్యమంత్రి.. ఆ తర్వాత కనిపించకుండా పోయారని.. ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నేను ఉన్నాను.. నేను విన్నాను అని చెప్పిన సీఎం ఇప్పుడెక్కడని ప్రశ్నించారు. ఇక తనపై కుట్ర చేసి మరీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని.. ఈ మేరకు వైసీపీ సోషల్ మీడియా విభాగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారని రఘురామ అన్నారు. అలాగే అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన.. తానేమీ భయపడనని ఆయన స్పష్టం చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రఘురామ కృష్ణం రాజు తెలిపారు.


     ఇది చదవండి: ఏపీ నుంచి తెలంగాణకు నో ఎంట్రీ.. పర్మిట్ చేయమంటున్న అధికారులు.. ఎవరికంటే..!


    సోషల్ మీడియాను ఆధారంగా చేసుకొని జరుగుతున్న పొలిటికల్ యుద్ధానికి వైసీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి.
    Published by:Purna Chandra
    First published: