హోమ్ /వార్తలు /National రాజకీయం /

Chandra babu: వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు.. సంచలన ప్రెస్ మీట్

Chandra babu: వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు.. సంచలన ప్రెస్ మీట్

వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు

వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు

Chandrababu Naidu:అసెంబ్లీ లో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా అసెంబ్లీలో తన సతీమణి నారా భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో ఆయన.. ఆ విషయాన్ని తలుచుకుని మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. అది కూడా వెక్కి వెక్కి ఏడ్చేశారు.

ఇంకా చదవండి ...


   chandrababu naidu:  ప్రత్యర్థిలపై పంచ్ లు వేస్తూ కనిపించే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)  తొలి సారి వెక్కి వెక్కి ఏడ్చారు. అది కూడా పబ్లిక్ గానే.. మళ్లీ ముఖ్యమంత్రి అయిన తరువాతే అసెంబ్లీలో అడుగుపెడతాను అంటూ సభలోనే శపథం చేసిన చంద్రబాబు.. తరువాత తనకు జరిగిన అవమానంపై మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా సభలో తనను ఎలా అవమానించారు మీడియాకు వివరించారు.  గత రెండేళ్లేగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy), వైసీపీ మంత్రులు (YCP Minsters).. ఇతర నేతలు తనను ఘోరంగా అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తనను విమర్శిస్తే బాధ పడనని... కానీ తన కుటుంబ సభ్యులను కూడా రోడ్డుపైకి ఈడుస్తున్నారని  భావోద్వేగానికి లోనయ్యారు. అసలు రాజకీయాలతో సంబంధం లేని తన భార్య వసుందర (Nara Vasundhara)ను కూడా అవమానిస్తున్నారు అంటూ .. మీడియాతో మాట్లాడుతూ వెక్కి వెక్కి ఏడ్చారు చంద్రాబాబు నాయుడు..


  అసెంబ్లీ లో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా అసెంబ్లీలో తన సతీమణి నారా భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో ఆయన.. ఆ విషయాన్ని తలుచుకుని మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. అది కూడా వెక్కి వెక్కి ఏడ్చేశారు.
  రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే అన్నారు చంద్రబాబు నాయుడు.. కుప్పలంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని గెలిచి.. ఇంత అవహేళన చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. తనను రాజకీయంగా ఎన్ని విమర్శలు అయినా చేయడండి పరవలేదు అన్నారు. విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయాల్లో సహజమే అని.. కానీ కుటుంబ సభ్యులను తిట్టడం ఏంటని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. భార్యపైనా, కుటుంబపై నా అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పురుష వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. అందుకు ఇలా కన్నీటి పర్యంతమయ్యారు.
  అంతకుముందు అసెంబ్లీలో కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. వైసీపీ సభ్యులు శృతి మించి వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కుటుంబంలోని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇకపై.. తాను ముఖ్యమంత్రి అయ్యాకే తిరిగి సభలో అడుగుపెడతానని శపథం చేశారు. సభలో జరిగిన పరిణామాలపై ఆవేదనతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని వెల్లడిస్తున్నప్పుడు చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

  ఆ వెంటనే అసెంబ్లీ సమావేశాలను భవిష్కరించి.. విజయవాడలో మీడియా సమవేశం పెట్టారు. కానీ అక్కడ తన్నుకొస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు చంద్రబాబు నాయుడు.. ప్రజలు ఓట్లేసి 151 సీట్లు వైసీపీకిచ్చి.. మాకు 23 స్థానాలు ఇచ్చినా తాను బాధపడలేదన్నారు. కానీ ఈ ప్రభుత్వం ప్రజల పాలిట భస్మాసుర హస్తంగా మారిందని.. ఇది కౌరవ సభ.. గౌరవం లేని సభ అంటూ చురకలు అంటించారు. జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద నేతలతో పని చేశామని.. ప్రజల కోసం రాజకీయం చేస్తున్నామని గర్వంగా ఫీలయ్యేవాళ్లమని తెలిపారు.

  వైసీపీ ప్రభుత్వం, నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను ఆయన తప్పుబట్టారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాన్న అన్ని విధాల అవమానిస్తోంది అన్నారు. రెండున్నర సంవత్సరాలుగా తనపై మాట్లాడారు..బండ బూతులు తిట్టారు. అనేక మంది నాయకులతో తాను పని చేయడం జరిగిందని, ఎన్నికల్లో గెలిచాం..ఓడిపోయామన్నారు. తమ వ్యక్తిత్వాలను కించపరిచేలా వైసీపీ ప్రవర్తించిందని, ఓడినప్పుడు కుంగిపోలేదు..గెలిచినప్పుడు రెచ్చిపోలేదన్నారు. ఎంతో మంది సీనియర్ రాజకీయ నేతలను.. ముఖ్యమంత్రులను చూశాను కానీ.. ఇంత దారుణంగా ప్రవర్తించే వారిని తన రాజకీయ జీవితంలో తొలిసారి చూస్తున్నాను అన్నారు చంద్రబాబు నాయుడు..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu

  ఉత్తమ కథలు