• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TDP CHIEF NARA CHANDRA BABU NAIDU URGES PARTY CADRE TO NOT CELEBRATE HIS BIRTHDAY DUE TO COVID ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Nara Chandrababu Naidu: పుట్టినరోజు వేళ చంద్రబాబు కీలక నిర్ణయం... మనసులో మాటపై కార్యకర్తలకు లేఖ

Nara Chandrababu Naidu: పుట్టినరోజు వేళ చంద్రబాబు కీలక నిర్ణయం... మనసులో మాటపై కార్యకర్తలకు లేఖ

చంద్రబాబునాయుడు (ఫైల్)

ఆంధ్రప్రదశ్ (Andhra Pradesh)కరోనా వైరస్ (Corona Virus) విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

  • Share this:
    తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులకు లేక రాశారు. ఏప్రిల్ 20 (మంగళవారం) చంద్రబాబు నాయుడు 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు లేఖరాసిన ఆయన.. అభిమానులు, కార్యకర్తలెవ్వరూ రేపు తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించవద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈమేరకు తన లేఖను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. “నా పుట్టినరోజుకు ఒక ప్రత్యేకతను తీసుకురావడానికి మీరంతా చేపట్టే కార్యక్రమాలు అభినందనీయం. అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అయితే ఇప్పుడు కొవిడ్-19 నుంచి రక్షణ పొందడం చాలా అవసరం. అందుకే నా పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని తెలుగుదేశం పార్టీ నేతలను, కార్యకర్తలను కోరుతున్నాను. దయచేసి మీరంతా ఒకరికొకరు భౌతిక దూరం పాటిస్తూ సురక్షితంగా ఉండండి. మీ అందరి క్షేమమే మీరు నాకిచ్చే జన్మదిన కానుక.” అని పేర్కొన్నారు.

    అలాగే “భారతదేశంలో కరోనా శరవేగంతో విస్తరిస్తూ ప్రమాదకారిగా మారుతున్నందున మనల్ని మనమే రక్షించుకోవాలి.కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో వీలైనంత రక్షణ పొందటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన మూడు సూచనలు అంతా పాటించాలి. ఏసి ఉన్న గదులలో కంటే గాలి, వెలుతురు బాగా ఉన్న బహిరంగ ప్రదేశాల్లో ఉండటం శ్రేయస్కరం. వీలైనంత వరకు ఇతరులకు దూరంగా ఉండండి. ఎవరినైనా కలవాల్సివస్తే వారితో గడిపే సమయం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. తెలుగువారంతా ఈ మూడు సూచనలు పాటించి, కోవిడ్ నుంచి వీలైనంత రక్షణ పొందండి.” అంటూ మరో ట్వీట్ చేశారు చంద్రబాబు.

    ఇది చదవండి: కొవిడ్ టైమ్ లో ఇతడే నిజమైన హీరో.. శంకర్ కు సెల్యూట్ చేయాల్సిందే..!



    చంద్రబాబు బర్త్ డేను ప్రతి ఏడాది భారీగా ప్లాన్ చేసే టీడీపీ కార్యకకర్తలు, నేతలు ఆయన ట్వీట్ తో డీలా పడ్డారు. మరోవైపు కొవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న దృష్ట్యా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను ఆన్ లైన్లోనే నిర్వహిస్తున్నారు. చంద్రబాబు కూడా పార్టీ నేతలతో జూమ్ యాప్ ద్వారానే సమావేసమవుతున్నారు. గత ఏడాది మహానాడు కార్యక్రమాన్ని కూడా ఆన్ లైన్లోనే నిర్వహిచారు. మరోవైపు కొవిడ్ కారణంగా తెలుగు దేశం పార్టీ కార్యాలయం కూడా కళ తప్పింది. ఎప్పుడో ఒకసారి నేతలు కార్యాలయానికి వెళ్తున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇటీవలే విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయాన్ని మూసివేశారు. అశోక్ గజపతి రాజు కోటలో ఉన్న కార్యాలయాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా చంద్రబాబు కూడా పుట్టినరోజుల వేడుకలు నిర్వహించవద్దని పిలుపునివ్వడం కొవిడ్ తీవ్రత ఎంత ఉందో మరోసారి స్పష్టమవుతోంది. అటు ప్రభుత్వం కూడా భారీ సభలు, సమావేశాలు, వేడుకలు నిర్వహించవద్దని ప్రజలకు సూచిస్తోంది.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు