• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TDP CHIEF NARA CHANDRA BABU NAIDU FILE COUNTER ON FIR FILED BY CID ON AMARAVATI LANDS SCAM FULL DETAILS HERE PRN

Amaravati Lands Scam: సీఐడీ నోటీసుపై కోర్టుకెళ్లిన చంద్రబాబు.. విచారణ ఎప్పుడంటే..

Amaravati Lands Scam: సీఐడీ నోటీసుపై కోర్టుకెళ్లిన చంద్రబాబు.. విచారణ ఎప్పుడంటే..

చంద్రబాబునాయుడు

ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత సీఐడీ (AP CID) అధికారులు చంద్రబాబుకు (Nara Chandrababu Naidu) నోటీసులివ్వగా.. న్యాయసలహా తీసుకున్న అనంతరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

  • Share this:
    రాజధాని అసెంబ్లీ భూముల కుంభకోణంలో సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఆర్ ను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైకోర్టులో సవాల్ చేశారు. ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిగే అవకాశముంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత సీఐడీ అధికారులు చంద్రబాబుకు నోటీసులివ్వగా.. న్యాయసలహా తీసుకున్న అనంతరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజధాని అమరావతిలోని అసైన్డ్ భూములను అక్రమంగా విక్రయిచేలా దళితులపై ఒత్తిడి తెచ్చారని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈనెల 23న విచారణకు హాజరుకావాలని సీఆర్పీసీలోని సెక్షన్ 41 (ఏ)(1) ప్రకారం నోటీసులు ఇచ్చారు.

    ఈనెల 13న చంద్రబాబుపే సీఐడీ కేసులు నమోదు చేయగా.. ఆయనకు నోటీసులు ఇచ్చిన సందర్భంగా అసలు విషయం బయటకి వచ్చింది. చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్ 166, 167, 217, 120 (బీ) రెడ్‌ విత్‌ 34, 35, 36, 37, ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1), (ఎఫ్‌), (జీ), ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొన్న సీఐడీ.. మాజీ మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణను ఏ2గా పేర్కొన్నారు. అలాగే కొంత మంది అధికారులు కూడా ఇందులో ఉన్నట్లు పొందుపరిచిన సీఐడీ.. వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు.

    ఇది చదవండి: ఏపీలో బీజేపీకి షాక్ ఇవ్వ‌నున్న ప‌వ‌న్...? బంధానికి ముగింపు పలుకుతారా..?



    ఈనెల 23న ఉదయం 11 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ రీజనల్ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని చంద్రబాబుకు నోటీసులిచ్చిన అధికారులు.. విచారణకు హాజరుకాకపోయినా, విచారణలో వెల్లడించిన విషయాలతో సంతృప్తి చెందకపోయినా అరెస్ట్ చేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఇదే కేసులో తన దగ్గరున్న ఆధారాలను సమర్పించాలని సీఐడీ.. ఎమ్మెల్యే ఆర్కేకు నోటీసులు జారీ చేయగా.. ఆయన విచారణకు హాజరయ్యారు. సీఐడీ అధికారులకు ఆయన దగ్గరున్న ఆధారాలను అందించారు.

    ఇది చదవండి: విజయవాడ మేయర్ గా భాగ్యలక్ష్మి... ఆ మూడు పదవులు మహిళలకే


    Published by:Purna Chandra
    First published: