హోమ్ /వార్తలు /politics /

Andhra Pradesh: అప్పుడు జగన్.. ఇప్పుడు చంద్రబాబు.. సేమ్ సీన్ రిపీట్..

Andhra Pradesh: అప్పుడు జగన్.. ఇప్పుడు చంద్రబాబు.. సేమ్ సీన్ రిపీట్..

వైజాగ్ ఎయిర్ పోర్టులో జగన్ (ఫైల్), తిరుపతి ఎయిర్ పోర్టులో చంద్రబాబు

వైజాగ్ ఎయిర్ పోర్టులో జగన్ (ఫైల్), తిరుపతి ఎయిర్ పోర్టులో చంద్రబాబు

AP Politics: గతంలో వైఎస్ జగన్ (YS Jaganmohan Reddy)కు ఎదురైన అనుభవం.. ఇప్పుడు చంద్రబాబుకు (Nara ChandraBabu Naidu) ఎదురైంది. ప్రాంతాలు వేరైనా.. ఎపిసోడ్ మాత్రం సీన్ టు సీన్.. ఫ్రేమ్ టు ఫ్రేమ్ రిపీట్ అయింది.

  ఏపీ రాజకీయాల్లో సీన్ రివర్స్ అయింది. గతంలో వైఎస్ జగన్ కు ఎదురైన అనుభవం.. ఇప్పుడు చంద్రబాబుకు ఎదురైంది. ప్రాంతాలు వేరైనా.. ఎపిసోడ్ మాత్రం సీన్ టు సీన్.. ఫ్రేమ్ టు ఫ్రేమ్ రిపీట్ అయింది. 2017లో విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ కు ఎదురైన అనుభవమే.. 2021లో చంద్రబాబుకు ఎదురైంది. దీంతో ఏపీలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోందంటూ చిత్తూరులో నిరసన తెలిపేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి తిరుపతిలోని రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. జిల్లాలో పర్యటించేందుకు అనుమతి లేదని.. కొవిడ్ నిబంధనలు, ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు.

  పోలీసుల తీరుకు నిరసనగా చంద్రబాబు ఎయిర్ పోర్టు లాంజ్ లోనే చంద్రబాబు నేలపై బైఠాయించారు. పోలీసులు బ్రతిమిలాడినా చంద్రబాబు మాత్రం వెనక్కితగ్గలేదు. అంతేకాదు దండం పెడుతూ బ్రతిమిలాడినా బాబు మాత్రం నిరసన కొనసాగించారు. తాను ఏం తప్పుచేశానని.. ఈ దౌర్జన్యమేంటని పోలీసులను నిలదీసిన చంద్రబాబు.. నేనేమైనా హత్య చేయడానికి వెళ్తున్నానా అంటూ వారిని ప్రశ్నించారు. చిత్తూరు వెళ్లి తీరుతా ఎవరొచ్చి ఆపుతారో చూస్తానంటూ సవాల్ విసిరారు. ఐతే పోలీసులు మాత్రం చంద్రబాబును ఒక్క అడుగు కూడా ముందుకు వేయనీయలేదు.

  TDP Chief Nara Chandra Babu Naidu, YS Jagan, Vizag Airport, Special status Andhra Pradesh, Nara Chandra Babu naidu, YS Jaganmohan Reddy, Andhra Pradesh news, Chandra Babu Naidu, YS Jagan in Vizag Airport, Special Status Protest, YSRCP, YS Jagan vs Chandra Babu, AP news, Telugu news, AP CM YS Jaganmohanreddy, YS Jagan news, Tirupati Airport, Visakhapatnam, Vizag, Tirupati, Chittoor District, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్, వైజాగ్ ఎయిర్ పోర్టు, ఏపీకి ప్రత్యేక హోదా, నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ న్యూస్, చంద్రబాబు నాయుడు, విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్, వైఎస్ఆర్సీపీ, ప్రత్యేక హోదా నిరసనలు, వైఎస్ జగన్ vs చంద్రబాబు నాయుడు, ఏపీ న్యూస్, తెలుగు న్యూస్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిస, వైఎస్ జగన్ న్యూస్, తిరుపతి ఎయిర్ పోర్ట్, విశాఖపట్నం, వైజాగ్, తిరుపతి, చిత్తూరు జిల్లా
  తిరుపతి ఎయిర్ పోర్టులో బైఠాయించిన చంద్రబాబు.

  ఇది చదవండి: రేణిగుంట ఎయిర్ పోర్టులో టెన్షన్ టెన్షన్... చంద్రబాబుకు నో పర్మిషన్...  అప్పుడేం జరిగిందంటే..

  2017లో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే ఏడాది జనవరి 26న ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ విశాఖ బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన క్యాండిల్ ర్యాలీకి హాజరయ్యేందుకు వెళ్లారు. ఐతే జగన్ పర్యటనకు అనుమతి లేదంటూ ఎయిర్ పోర్టులోనే పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. రన్ వైపే ఫ్లైట్ దిగిన వెంటనే పోలీసులు చుట్టుముట్టడంతో ఆగ్రహంతో అక్కటే బైఠాయించి నిరసన తెలిపారు. జగన్ తో పాటు విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు వంటి నేతలంతా ఎయిర్ పోర్టులోనే నిరసనకు దిగారు. కనీసం ఎయిర్ పోర్ట్ లాంజ్ లోనికి కూడా అనుమతించకపోవడం తీవ్ర దుమారం రేపింది. ఇంకా రెండేళ్లలో అధికారంలోకి వస్తామని.. అందరి సంగతి చూస్తామంటూ అప్పట్లో జగన్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

  TDP Chief Nara Chandra Babu Naidu, YS Jagan, Vizag Airport, Special status Andhra Pradesh, Nara Chandra Babu naidu, YS Jaganmohan Reddy, Andhra Pradesh news, Chandra Babu Naidu, YS Jagan in Vizag Airport, Special Status Protest, YSRCP, YS Jagan vs Chandra Babu, AP news, Telugu news, AP CM YS Jaganmohanreddy, YS Jagan news, Tirupati Airport, Visakhapatnam, Vizag, Tirupati, Chittoor District, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్, వైజాగ్ ఎయిర్ పోర్టు, ఏపీకి ప్రత్యేక హోదా, నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ న్యూస్, చంద్రబాబు నాయుడు, విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్, వైఎస్ఆర్సీపీ, ప్రత్యేక హోదా నిరసనలు, వైఎస్ జగన్ vs చంద్రబాబు నాయుడు, ఏపీ న్యూస్, తెలుగు న్యూస్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిస, వైఎస్ జగన్ న్యూస్, తిరుపతి ఎయిర్ పోర్ట్, విశాఖపట్నం, వైజాగ్, తిరుపతి, చిత్తూరు జిల్లా
  విశాఖ ఎయిర్ పోర్టు రన్ వేపై బైఠాయించిన వైఎస్ జగన్, విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి (ఫైల్)

  ఇది చదవండి: మానవత్వం చాటుకున్న మంత్రి గౌతమ్ రెడ్డి...  రాజకీయాల్లో ఎప్పుడూ ఒకే రకమైన పరిస్థితులుండవు. ఓడలు బళ్లవుతాయి.. బళ్లు ఓడలవుతాయి.. అదికార పక్షం.. ప్రతిపక్షమవుతుంది.. ప్రతిపక్షం అధికారంలోకి వస్తుంది. జగన్ వైజాగ్ పర్యటన సందర్భంగా అప్పటి ప్రభుత్వం చేసింది కరెక్ట్ అయింతే.. ఇప్పుడు తిరుపతి ఎయిర్ పోర్టులో ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా కరెక్టేనని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఐతే చంద్రబాబు విషయంలో మాత్రం సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి ఎదురవడం చర్చనీయాంశమైంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap cm ys jagan mohan reddy, AP News, Chandrababu Naidu, TDP, Telugu news, Ys jagan, Ys jagan mohan reddy, Ysrcp