ఏపీ ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ..

ఏపీ ప్రజలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై అందులో వివరించారు.

news18-telugu
Updated: April 28, 2020, 11:05 AM IST
ఏపీ ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ..
అయితే చంద్రబాబు చేసిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న చిత్తూరు జిల్లా పోలీసులు.. ఓం ప్రతాప్ మృతిపై సాక్ష్యాధారాలు ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు.
  • Share this:
ఏపీ ప్రజలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై అందులో వివరించారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం పెనం మీద నుంచి పొయ్యిలోకి నెట్టిందని విమర్శించారు. వారం రోజుల్లోనే రాష్ట్రంలో కరోనా కేసులు రెట్టింపయ్యాయని. వైసీపీ నాయకుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని ఆరోపించారు. ముందుగా తేలిగ్గా మాట్లాడటం, తర్వాత చేతగానితనాన్ని బయటపెట్టడం పాలకుల లక్షణం కాదని సీఎం జగన్‌కు చురక అంటించారు. అప్పుడేమో ‘కరోనా వస్తుంది.. పోతుంది.. పారాసిటమాల్, బ్లీచింగ్ చాలు’ అని తేలిగ్గా వ్యాఖ్యలు చేశారని... ఇప్పుడు ‘కరోనాతో కలిసి జీవిద్దాం, మన జీవనంలో ఇది కూడా అంతర్భాగం, మామూలు జ్వరం లాంటిదే ఇది’ అంటూ వ్యాఖ్యానించడం పాలకుల డొల్లతనాన్ని బయటపెట్టాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఇక, వలస కార్మికుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందన్నారు. స్వస్థలాలకు వెళ్లేందుకు కాలినడకన వేల కిలోమీటర్లు నడిచి వెళ్లడం మనసు కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులు, చేతివృత్తులవారు, ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారన్నారు. రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని చంద్రబాబు అన్నారు. రైతులను ఆదుకోవాలని అనేక లేఖలు రాసినా ప్రభుత్వంలో స్పందన లేదని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రం కొన్న ధాన్యంలో పదో వంతు కూడా మన రాష్ట్రంలో కొనలేదని విమర్శించారు. పంట ఉత్పత్తులు ముందే సేకరిస్తే ఇప్పుడు అకాల వర్షాలు, తుఫాన్ల వల్ల రైతులకు నష్టం వాటిల్లేది కాదని చెప్పుకొచ్చారు. బాధ్యతాయుతమైన పార్టీగా ప్రజలకు టీడీపీ అండగా ఉందని పేర్కొన్నారు. 

కరోనా తీవ్రతను ముందుగానే గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించామని చంద్రబాబు అన్నారు. కంటైన్మెంట్ జోన్లలో కూడా నిబంధనలు వైసీపీ నేతలు పాటించలేదని ఆయన మండిపడ్డారు. నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని అందువల్లే కరోనా వైరస్ రోజురోజుకూ పెరిగిపోయిందని అన్నారు. కరోనా కన్నా స్థానిక ఎన్నికలే ముఖ్యంగా వైసీపీ నేతల ధోరణి ఉంది తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ సరుకుల కోసం చౌకడిపోల వద్ద వందలాది మందిని క్యూలైన్లలో గంటల తరబడి నిలబెట్టారని.. కరోనా వైరస్ వ్యాప్తికి ఇది మరో కారణమన్నారు. 

లాక్‌డౌన్‌లోనూ యధేచ్చగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్నారు. హెల్త్ బులెటిన్లను ఫార్స్‌గా మార్చారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కరోనా కిట్లలోనూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కరోనా టెస్టులను నిర్లక్ష్యం చేయడమే రాష్ట్రంలో పెను విషాదంగా మారిందన్నారు. నాసిరకం పీపీఈలతో కరోనా వైద్య సిబ్బంది‌ని వైరస్‌పై యుద్ధానికి వారిని పంపడం ఆత్మహత్యా సదృశమే అని ఆయన అన్నారు. వైసీపీ ఎంపీ కుటుంబంలో ఆరుగురికి వైరస్ సోకడం, వారిలో నలుగురు డాక్టర్లు కావడం, గవర్నర్ నివాసం రాజ్‌ భవన్‌లోనే పలువురికి వైరస్ సోకడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు పరాకాష్ట అని చెప్పుకొచ్చారు. 

తనను నిందించినా, టీడీపీని దూషించినా ప్రజల కోసం భరిస్తామని కానీ రాష్ట్రానికి తీరని నష్టం చేయడాన్ని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటాన్ని భరించలేమని స్పష్టం చేశారు. విపత్తులలోనే నాయకత్వ సామర్థ్యం బయటపడేదన్నారు. ఇక, వైసీపీ రంగులపై ఉన్న శ్రద్ధ కరోనా టెస్టింగ్‌లపై చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘మన ఊరు, మన వార్డు, మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి’ అంటూ ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: April 28, 2020, 11:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading