చాలా సంతోషం.. సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ..

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. విశాఖ మెడ్ టెక్ గురించి ప్రస్తావిస్తూ.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

news18-telugu
Updated: April 9, 2020, 8:44 AM IST
చాలా సంతోషం.. సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ..
చంద్రబాబు, జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. విశాఖ మెడ్ టెక్ గురించి ప్రస్తావిస్తూ.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. లేఖలో ఏం అన్నారంటే.. ‘దేశంలోనే తొలి మెడికల్ ఎక్విప్‌మెంట్ తయారీ పార్క్‌గా విశాఖపట్నంలో నెలకొల్పిన మెడ్ టెక్ జోన్ ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినందుకు సంతోషం. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ దూరదృష్టి, ముందు చూపు ఆలోచనలే ప్రస్తుత మెడ్ టెక్ జోన్ పనితీరుకు నిదర్శనాలు. అయితే, గత 10 నెలల కాలంలో దాన్ని నిర్లక్ష్యం చేయకుండా అభివృద్ధి చేసి ఉంటే దేశానికే మెరుగైన సేవలు అందించే స్థాయిలో ఉండేది. మయ సభగా మెడ్ టెక్ జోన్‌ను విమర్శించిన వాళ్లే ఇప్పుడు దేశానికే గర్వకారణంగా చెప్పడం ఆనంద దాయకం.’ అని తెలిపారు.

మెడ్ టెక్ జోన్ల మాదిరిగానే అన్నా క్యాంటీన్లు, చంద్రన్న బీమా, ఆర్టీజీఎస్ కూడా పునరుద్ధరించాలని సీఎం జగన్‌ను చంద్రబాబు కోరారు. రాజకీయ కక్షతో అన్నా క్యాంటీన్లను మూసివేయడం తగదని, కరోనా సంక్షోభంలో పేదలకు ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. ఇంకా.. మద్దతు ధర చెల్లించి పంట ఉత్పత్తులన్నీ కొని రైతులను ఆదుకోవాలని, ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: April 9, 2020, 8:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading