చంద్రబాబు స్కెచ్... ఆమంచి స్థానంలో కరణం బలరాం ?

Amanchi krishnamohan resigns to TDP | కొద్దిరోజుల క్రితం ఆమంచి పార్టీ వీడకుండా ఉండేందుకు స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమంచి వైసీపీలో చేరితే ఆయనకు చెక్ చెప్పడం ఎలా అనే దానిపై ముందుగానే ప్లాన్ రెడీ చేసుకున్న చంద్రబాబు... చీరాల నుంచి పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి కరణం బలరాంను రంగంలోకి దింపేందుకు సిద్ధమయ్యారు.

news18-telugu
Updated: February 13, 2019, 11:09 AM IST
చంద్రబాబు స్కెచ్... ఆమంచి స్థానంలో కరణం బలరాం ?
ఆమంచి కృష్ణమోహన్, చంద్రబాబు, కరణం బలరాం
  • Share this:
టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరేందుకు సిద్ధమైన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు చెక్ చెప్పేందుకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వేగంగా పావులు కదుపుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఆమంచి పార్టీ వీడకుండా ఉండేందుకు స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమంచి వైసీపీలో చేరితే ఆయనకు చెక్ చెప్పడం ఎలా అనే దానిపై ముందుగానే ప్లాన్ రెడీ చేసుకున్న చంద్రబాబు... చీరాల నుంచి పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి కరణం బలరాంను రంగంలోకి దింపేందుకు సిద్ధమయ్యారు.

ఆమంచి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన వెంటనే కరణం బలరాంను చీరాల వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. పార్టీ శ్రేణులెవరూ ఆమంచి కృష్ణమోహన్‌తో వెళ్లకుండా చర్యలు చేపట్టాలని టీడీపీ అధినేత కరణం బలరాంను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఆమంచి కృష్ణమోహన్‌ను రాజకీయంగా ఢీ కొట్టాలంటే కరణం బలరాం ఒక్కరే సరైన వ్యక్తి అని భావిస్తున్న చంద్రబాబు... చీరాల నుంచి వచ్చే ఎన్నికల్లో ఆయనను బరిలోకి దింపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కరణం బలరాంకు చీరాల సీటు కేటాయించడం వల్ల అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాంకు మధ్య ఉన్న గొడవలు కూడా తగ్గుముఖం పడతాయని చంద్రబాబు యోచిస్తున్నట్టు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఆమంచి కృష్ణమోహన్‌కు పోటీగా కరణం బలరాంను రంగంలోకి దించాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.
First published: February 13, 2019, 11:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading