కేసీఆర్ పుట్టిన రోజున చంద్రబాబు స్పెషల్ ట్వీట్..

KCR Birthday : తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక ట్వీట్ చేశారు. కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

news18-telugu
Updated: February 17, 2020, 12:39 PM IST
కేసీఆర్ పుట్టిన రోజున చంద్రబాబు స్పెషల్ ట్వీట్..
కేసీఆర్, చంద్రబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక ట్వీట్ చేశారు. కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలను ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను’ అని వ్యాఖ్యానించారు. అటు.. ఏపీ సీఎం జగన్ కూడా కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన ట్విట్టర్ వేదికగా.. ‘తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా.’అని పేర్కొన్నారు.కాగా, చంద్రబాబు ట్వీట్ చేయడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. రాజకీయ బద్ధ శత్రువులైన కేసీఆర్, చంద్రబాబు.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎప్పుడూ మాట్లాడుకోలేదు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని సీఎం కేసీఆర్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.


First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు