Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    వంగవీటి రాధా రాకపై ఏమంటారు ?... కృష్ణా టీడీపీ నేతలతో చంద్రబాబు

    వంగవీటి రాధాను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఎలాంటి పరిణామాలు ఉంటాయనే దానిపై జిల్లాకు చెందిన పార్టీ నేతలతో చంద్రబాబు కూలంకషంగా చర్చించినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా వంగవీటి రాధా రాక వల్ల ఎక్కువగా ప్రభావం ఉండే విజయవాడ నగరంలోని టీడీపీ నేతల అభిప్రాయాలను చంద్రబాబు పూర్తిగా పరిగణనలోకి తీసుకున్నారని సమాచారం.

    news18-telugu
    Updated: January 22, 2019, 12:51 PM IST
    వంగవీటి రాధా రాకపై ఏమంటారు ?... కృష్ణా టీడీపీ నేతలతో చంద్రబాబు
    చంద్రబాబు, వంగవీటి రాధాక్రిష్ణ
    • Share this:
    ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ... టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ నెల 25న ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వంగవీటి రాధా టీడీపీలో చేరబోతున్నారు. వంగవీటి రాధాను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఎలాంటి పరిణామాలు ఉంటాయనే దానిపై జిల్లాకు చెందిన పార్టీ నేతలతో చంద్రబాబు కూలంకషంగా చర్చించినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా వంగవీటి రాధా రాక వల్ల ఎక్కువగా ప్రభావం ఉండే విజయవాడ నగరంలోని టీడీపీ నేతల అభిప్రాయాలను చంద్రబాబు పూర్తిగా పరిగణనలోకి తీసుకున్నారని సమాచారం.

    విజయవాడకు చెందిన చెందిన టీడీపీ నేతలందరి అభిప్రాయాలను తెలుసుకున్న చంద్రబాబు... వంగవీటి రాధా చేరిక వల్ల ప్రస్తుతం ఉన్న టీడీపీ నేతలెవరికీ ఇబ్బందులు కలగబోవని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో వంగవీటి రాధాకృష్ణ పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చని కూడా టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎమ్మెల్యేగా కాకుండా వంగవీటి రాధాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

    ఎమ్మెల్సీగా ఉంటూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం వంగవీటి రాధా కృషి చేస్తే... ఆ తరువాత ఆయనకు పదోన్నతి ఇచ్చే అవకాశం కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు పార్టీ నియమాలకు లోబడి వంగవీటి రాధాకృష్ణ పనిచేసేలా చూడాలని కొందరు టీడీపీ నేతలు చంద్రబాబుకు సూచించినట్టు సమాచారం. మొత్తానికి టీడీపీలోకి వంగవీటి రాధాకృష్ణ రాకను కృష్ణా జిల్లా టీడీపీ నేతలెవరూ వ్యతిరేకించకపోవడంతో... ఆయన చేరిక లాంఛనం కానుంది.

    ఇవికూడా చూడండి:
    First published: January 22, 2019, 12:19 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading