• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TDP CHIEF CHANDRABABU PLANS TO COUNTER ASADUDDIN OWAISI IN ANDHRA PRADESH AK

చంద్రబాబు మాస్టర్ ప్లాన్... ఏపీలో అసదుద్దీన్‌ ఓవైసీకి చెక్ ?

చంద్రబాబు మాస్టర్ ప్లాన్... ఏపీలో అసదుద్దీన్‌ ఓవైసీకి చెక్ ?

అసదుద్దీన్ ఓవైసీ, చంద్రబాబు

ఏపీలో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్న ఎంఐఎం అధినేతకు అసదుద్దీన్ ఓవైసీకి చెక్ పెట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారు.

  • Share this:
    టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ జగన్‌తో కలిసి తమను టార్గెట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని పదే పదే విమర్శలు గుప్పిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు... వారిని ఎదుర్కోవడానికి తనదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారు. కేసీఆర్ ఏపీలో అడుగుపెడితే... ఆయనను ఎదుర్కోవడానికి ఇప్పటికే వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్న టీడీపీ... ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ రాజకీయ దాడిని ఎదుర్కోవడానికి కూడా సీరియస్‌గానే ప్రయత్నాలు చేస్తోంది. కడప మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి అహ్మదుల్లాను చంద్రబాబు పార్టీలో చేర్చుకోవడం వెనుక ఉన్న వ్యూహం కూడా ఇదేనని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

    వైఎస్ కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ వైసీపీలో చేరని అహ్మదుల్లాను టీడీపీలో చేర్చుకున్న చంద్రబాబు... ఆయన కుమారుడికి కడప జిల్లా ఇన్‌ఛార్జ్ బాధ్యతలను అప్పగించడం మరో విశేషం. అయితే అహ్మదుల్లాను పార్టీలో చేర్చుకోవడంతో పాటు ఆయన కుమారుడికి ప్రాధాన్యత ఇవ్వడం వెనుక అసలు వ్యూహాం ఎంఐఎం అధినేత ఓవైసీకి చెక్ చెప్పడమే అని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అసదుద్దీన్ ఓవైసీపీ ఏపీలోకి వచ్చిన జగన్‌కు అనుకూలంగా ప్రచారం చేయడం వెనుక అసలు కారణం... ముస్లింలను వైసీపీ దగ్గర చేయడమే.

    ఏపీలో మైనార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉండే కడప, కర్నూలు, అనంతపురం జిల్లాతో పాటు గుంటూరు లాంటి జిల్లాల్లో పర్యటించాలని అసదుద్దీన్ ప్లాన్ చేసుకున్నట్టు గ్రహించిన చంద్రబాబు... కడప, కర్నూలు జిల్లాల్లో మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే అహ్మదుల్లాను పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు... ఫరూక్‌కు కొన్ని నెలల క్రితమే మంత్రి పదవి కట్టబెట్టారు.

    కర్నూలు జిల్లాకు చెందిన ఫరూక్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం ద్వారా ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చామనే సంకేతాలు ఇచ్చిన చంద్రబాబు... రాబోయే ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ స్థానాన్ని ఆయనకే ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వీరితో పాటు అనంతపురం, గుంటూరు వంటి జిల్లాల్లోనే మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చి... వైసీపీకి దానికి అనుకూలంగా ప్రచారం చేయాలనుకుంటున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి చెక్ చెప్పాలని చంద్రబాబు భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి... చంద్రబాబు వ్యూహాలు ఎంతమేరకు ఫలిస్తాయో చూడాలి.

    VIDEO : టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయమని ఆనాడే చెప్పా : మోత్కుపల్లి
    First published:

    అగ్ర కథనాలు