• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TDP CHIEF CHANDRABABU PHONE CALL TO TIRUPATI EX MLA SUGUNAMMA ABOUT SETTIPALLE VILLAGE PANCHAYAT ELECTIONS HSN

AP Panchayat Elections: మాజీ ఎమ్మెల్యేకు చంద్రబాబు ఫోన్ కాల్.. హుటాహుటిన రాత్రిపూట ఆ గ్రామానికి వెళ్లిన టీడీపీ నేతలు

AP Panchayat Elections: మాజీ ఎమ్మెల్యేకు చంద్రబాబు ఫోన్ కాల్.. హుటాహుటిన రాత్రిపూట ఆ గ్రామానికి వెళ్లిన టీడీపీ నేతలు

చంద్రబాబు నాయుడు (ఫైల్ ఫొటో)

ఓ గ్రామంలో టీడీపీ మద్ధతుదారులు ఎవరూ నామినేషన్లు వేయకపోవడం గురించి తెలిసి చంద్రబాబు వెంటనే మాజీ ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు. దీంతో హుటాహుటిన ఆ మాజీ ఎమ్మెల్యేతోపాటు లోక్ సభ టీడీపీ అధ్యక్షుడు ఆ గ్రామానికి వెళ్లి టీడీపీ నేతలతో చర్చలు జరపడం గమనార్హం.

  • Share this:
    ఏపీలో పంచాయతీ ఎన్నికలు రాజకీయ సెగలు పుట్టిస్తున్నాయి. అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. పేరుకు పార్టీ రహితంగా జరిగే ఎన్నికలే అయినా రాజకీయ పార్టీలు మాత్రం ఈ ఎన్నికలను సవాల్ గా తీసుకుంటుంటాయి. ఇప్పటికే వచ్చిన మొదటి విడత ఫలితాల్లో అధికారంలో ఉన్న వైసీపీయే పైచేయి సాధించింది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా పంచాయతీ ఎన్నికలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర సంఘటన తిరుపతి సెగ్మెంట్ పరిధిలో జరిగింది. ఓ గ్రామంలో టీడీపీ మద్ధతుదారులు ఎవరూ నామినేషన్లు వేయకపోవడం గురించి తెలిసి వెంటనే మాజీ ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు. దీంతో హుటాహుటిన ఆ మాజీ ఎమ్మెల్యేతోపాటు  తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ఆ గ్రామానికి వెళ్లి టీడీపీ నేతలతో చర్చలు జరపడం గమనార్హం.

    తిరుపతి సెగ్మెంట్ పరిధిలో శెట్టిపల్లె ఏకైక పంచాయతీగా ఉంది. ఇక్కడ గత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారు బత్తుల స్వప్న గెలిచారు. ఈ గ్రామంలో మొత్తం 12 వార్డులు ఉండగా, తొమ్మిది వార్డులు తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లోకి, మిగిలిన మూడు వార్డులు చంద్రగిరి సెగ్మెంట్ పరిధిలోకి వెళ్తాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ గ్రామంలో టీడీపీ ఆధిక్యం కనపర్చింది. చాలా ఏళ్లుగా ఈ గ్రామంలో అపరిష్కృతంగా ఉన్న భూములకు ల్యాండ్ పూలింగ్ ద్వారా శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేస్తామని తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి హామీ ఇచ్చారు. ఈ గ్రామాన్ని ఏకగ్రీవం చేయాలని ప్రయత్నాలు చేశారు. అయితే శెట్టిపల్లె గ్రామ సమస్యకు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే పరిష్కారం చూపుతూ జీవోను కూడా జారీ చేశామని, ఆ జీవో అమలు విషయంలో ఆలస్యం కారణంగానే సమస్య అలాగే మిగిలిపోయిందన్నది టీడీపీ నేతల వాదన. అయితే ఇక్కడ శుక్రవారం మాత్రమే నామినేషన్లకు ఆఖరు తేదీ. గురవారం వరకు కేవలం వైసీపీ సర్పంచ్, వార్డు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. టీడీపీ మద్దతుదారుల నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.

    ఈ విషయం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తెలిసింది. దీంతో తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ నరసింహ యాదవ్ కు పోన్లు చేసి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. శెట్టిపల్లెలో నామినేషన్లు ఎవరూ వేయకపోవడం గురించి ఆరా తీశారు. దీంతో సుగుణమ్మ, నరసింహ యాదవ్ హుటాహుటిన గురువారం రాత్రి శెట్టిపల్లెకు వెళ్లారు. గ్రామంలోని టీడీపీ మద్దతుదారులతో మాట్లాడారు. పార్టీ రహితంగా ఏకగ్రీవం అయితే ఫరవాలేదనీ, అధికార పార్టీ తరపున ఏకగ్రీవం అని ప్రకటిస్తే మాత్రం పోటీ పెట్టాల్సి వస్తుందని వారు వ్యాఖ్యానించారు. తమ మద్దతుదారులను బెదిరించి పోటీలో లేకుండా చేస్తున్నారన్నారు. మరి శుక్రవారమైనా ఈ గ్రామంలో టీడీపీ మద్ధతుదారులు నామినేషన్లు వేస్తారో? లేక ఏకగ్రీవం అవుతుందో వేచిచూడాలి.
    Published by:Hasaan Kandula
    First published: