ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ.. మీ నిర్ణయాలు భేష్ అంటూ..

Chandrababu writes letter to Modi : ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రం చర్యను మెచ్చుకున్నారు. కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీతో అల్పాదాయ వర్గాలకు మేలు జరుగుతుందని తెలిపారు.

news18-telugu
Updated: March 27, 2020, 9:50 AM IST
ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ.. మీ నిర్ణయాలు భేష్ అంటూ..
చంద్రబాబు, నరేంద్రమోదీ
  • Share this:
Chandrababu writes letter to Modi : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పట్ల అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. నిన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రం చర్యను స్వాగతించగా, తాజాగా.. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మెచ్చుకున్నారు. కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీతో అల్పాదాయ వర్గాలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు మోదీకి రెండు పేజీల లేఖను రాశారు. లేఖలో పారిశుధ్య కార్మికులు, హెల్త్ వర్కర్స్‌కి ఇన్సూరెన్స్ ప్రకటించినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

అంతేకాదు..ప్రజలు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయారని, రైతులకు ఖరీఫ్‌లో ఇవ్వాల్సిన నగదు కూడా ముందే ఇవ్వడం అభినందనీయమని చంద్రబాబు కొనియాడారు. అటు.. సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల రంగాన్ని కూడా ఆదుకోవాలని కోరారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగం దెబ్బతినకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

First published: March 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు