చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులతో దాడి.. రాజధానిలో హైటెన్షన్..

ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణాలను పరిశీలించేందుకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు బయల్దేరారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన ఆయన.. కాసేపట్లో అక్కడికి చేరుకోనున్నారు.

news18-telugu
Updated: November 28, 2019, 11:45 AM IST
చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులతో దాడి.. రాజధానిలో హైటెన్షన్..
అమరావతికి చంద్రబాబు
  • Share this:
ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణాలను పరిశీలించేందుకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు బయల్దేరారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన ఆయన.. కాసేపట్లో అక్కడికి చేరుకోనున్నారు. ఆయన వెంట టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఉన్నారు. అయితే, బాబు పర్యటనను అడ్డుకుంటామని కొందరు రైతులు హెచ్చరించారు. రాజధాని కోసం తమవద్ద భూములు తీసుకొని ప్లాట్లు ఇవ్వలేదని, ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటివి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. దళిత రైతుల పట్ల పూర్తి నిరంకుశ వైఖరి కనబరచారని ఆరోపిస్తున్నారు. బాబు పర్యటనకు వ్యతిరేకంగా నల్ల జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రైతులు రెండు వర్గాలుగా విడిపోయి వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లు రాజధాని ప్రాంతంలో రైతులు ఆందోళనకు దిగారు. వారికి తోడుగా గో బ్యాక్ చంద్రబాబు అంటూ వైసీపీ వర్గీయులు నినాదాలు చేపట్టారు.

దీంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీ వర్గీయులను హెచ్చరించారు. కాగా, కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులతో దాడికి దిగారు. అటు టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో వెంకటపాలెం ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

Published by: Shravan Kumar Bommakanti
First published: November 28, 2019, 10:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading