TDP CHIEF CHANDRABABU NAIDU TAKES ON YS JAGAN OVER SAND ISSUE MS
సిగ్గుండాలి.. ఓవైపు కూలీలు చనిపోతుంటే ఇసుక వారోత్సవాలా..? : జగన్పై భగ్గుమన్న బాబు
చంద్రబాబు, వైఎస్ జగన్ (File)
ఒకవైపు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. మరోవైపు ఇసుక వారోత్సవాలు జరపడానికి సిగ్గుండాలని విమర్శించారు.ఏపీలో ఇప్పుడు ఊరికో నరకాసురుడు,రావణాసురుడు,బకాసురుడు తయారయ్యాడని విమర్శించారు.
రాష్ట్రంలో ఇసుక వారోత్సవాలు నిర్వహించాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రంలో జరపాల్సింది ఇసుక వారోత్సవాలు కాదని, ఇసుకాసురుల భరతం పట్టే వారోత్సవాలని ఎద్దేవా చేశారు. ఒకవైపు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. మరోవైపు ఇసుక వారోత్సవాలు జరపడానికి సిగ్గుండాలని విమర్శించారు.ఏపీలో ఇప్పుడు ఊరికో నరకాసురుడు, రావణాసురుడు, బకాసురుడు తయారయ్యాడని విమర్శించారు. నరకాసురుని అంతంతోనే దీపావళి వచ్చిందని.. అలాగే ఇసుకాసురలను అంతం చేస్తేనే పేదలకు అసలైన దీపావళి అని చెప్పారు.రాష్ట్రంలో ఇసుక కొరతపై బుధవారం పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
దినసరి కూలీలకు అండగా నిలబడుతున్న టీడీపీ నేతలను రాబందులు అంటూ విమర్శించడంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాబందులు తాము కాదని, మీరే రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారని వైసీపీని విమర్శించారు. ఇసుక కొరత కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారని.. మంగళవారం పిడుగురాళ్లలో గోపీ అనే ట్రక్కు డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని గుర్తుచేశారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని.. వీటిపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయాలని సూచించారు.ఆత్మహత్యలకు పాల్పడ్డ కూలీ కుటుంబాలకు టీడీపీ కార్యకర్తలు అండగా నిలబడాలని.. పార్టీ తరుపున ఆదుకోవాలని అన్నారు.ఇసుక కొరత కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులందరికీ రూ.10వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.