• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TDP CHIEF CHANDRABABU NAIDU STOPPED AT RENIGUNTA AIRPORT AND DETAINED SU

Chandrababu Naidu: పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం.. దండం పెట్టి బతిమాలిన పోలీసు అధికారి..

Chandrababu Naidu: పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం.. దండం పెట్టి బతిమాలిన పోలీసు అధికారి..

చంద్రబాబును బతిమాలుతున్న పోలీసులు(Image-Twitter)

చిత్తూరు జిల్లా పర్యటను నిమిత్తం రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును(Nara Chandrababu Naidu) పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకున్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. చిత్తూరు జిల్లా పర్యటను నిమిత్తం రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును(Nara Chandrababu Naidu) పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకున్నారు. చిత్తూరు వెళ్లేందుకు అనుమతి లేదని.. శాంతిభద్రతల సమస్య వస్తుందంటూ చంద్రబాబును బయటకు వెళ్లకుండా ఎయిర్‌పోర్ట్‌లోనే నిలిపివేశారు. ఈ సందర్భంగా పోలీసులు తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను కలెక్టర్‌ను, ఎస్పీని కలవాలని అనుకుంటున్నాని చెప్పారు. తనకు ఆ హక్కు లేదా అని ప్రశ్నించారు. తనను ఎందుకు అదుపులోకి తీసుకుంటారో సమాధానం చెప్పాల్సిందిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేమైనా హత్య చేసేందుకు వెళ్తున్నాన్నా ..?, 14 ఏళ్లు సీఎంగా పని చేశానయ్యా.. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నా.. తమాషాలు చేస్తున్నారా అంటూ పోలీసులపై మండిపడ్డారు.

    ఈ క్రమంలోనే చంద్రబాబు అక్కడే నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆయనను సముదాయించేందుకు ప్రయత్నం చేశారు. " సార్.. మీరు పెద్దవాళ్లు.. ఇక్కడ కూర్చొవడం బాగోదు, వేరే చోట కూర్చొండి" అని చెప్పారు. ఇందుకు చంద్రబాబు అంగీకరించలేదు. తాను ఎస్పీ దగ్గరకు వెళ్తానని చెప్పారు. అయితే పోలీసులు ఎస్పీనే ఇక్కడికి పిలిపిస్తున్నామంటూ సమాధానం ఇచ్చారు. అయితే తాను అంతా పెద్దవాడిని కాదంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక, ఎయిర్‌పోర్ట్‌లో తనను పోలీసులు అడ్డుకున్న వీడియోను చంద్రబాబు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పోలీసు చర్యలతో తమను అడ్డుకోలేరని ట్వీట్ చేశారు.



    Andhra Pradesh: రేణిగుంట ఎయిర్ పోర్టులో టెన్షన్ టెన్షన్... చంద్రబాబుకు నో పర్మిషన్...

    అయితే, ఈ సందర్భంగా చంద్రబాబుకు ఓ పోలీసు అధికారి దండం పెడుతూ బతిమాలారు. మొకాళ్లపై కూర్చొని చంద్రబాబుకు ఏదో చెప్పేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించి ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక, చంద్రబాబును అడ్డుకోవడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు చిత్తూరులో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఉదయం నుంచి టీడీపీ నేతలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ఎవరూ బయటకు రాకుండా కట్టడి చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. దానికి నిసనగా చిత్తూరులోని గాంధీ విగ్రహం ఎదుట నిరసనకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు