• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • TDP CHIEF CHANDRABABU NAIDU SET SPECIAL COMMITTEES FOR LOCAL BODY ELECTIONS HSN

AP Panchayat Elections: ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో.. కొత్త వ్యూహాన్ని మొదలు పెట్టిన చంద్రబాబు

AP Panchayat Elections: ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో.. కొత్త వ్యూహాన్ని మొదలు పెట్టిన చంద్రబాబు

చంద్రబాబు నాయుడు (ఫైల్ ఫొటో)

పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లలో తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు, అత్యధికంగా ఏకగ్రీవ పంచాయతీలను దక్కించుకునేందుకు వైసీపీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంటే, అటు ప్రతిపక్ష టీడీపీ కూడా అధికార పార్టీని ఢీకొట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కొత్త స్ట్రాటజీని మొదలుపెట్టారు. 

 • Share this:
  స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీలో రాజకీయ సెగలు పుట్టిస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య కంటే ఎక్కువగా ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య యుద్ధ వాతావరణం నడుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికల నిర్వహణలో దూకుడు పెంచిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. అటు ప్రభుత్వం కూడా మెజార్టీ సీట్లలో వైసీపీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు, అత్యధికంగా ఏకగ్రీవ పంచాయతీలను దక్కించుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ప్రతిపక్ష టీడీపీ కూడా అధికార పార్టీని ఢీకొట్టేందుకు సన్నద్ధమవుతోంది. మెజార్టీ సీట్లను దక్కించుకుని ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందన్న విషయాన్ని తెలియజేయాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 15 మంది సభ్యులతో రాష్ట్ర ఎన్నికల కమిటీని టీడీపీ అధినేత చంద్రబాబు ఏర్పాటుచేశారు.

  ఈ కమిటీలో నలుగురు ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఉంటారు. ఏడుగురు సభ్యులతో సమన్వయ కమిటీ, ముగ్గురు సభ్యులతో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 25 పార్లమెంటు నియోజకవర్గాలను ఐదు జోన్లుగా విభజించి ఒక్కో జోన్‌ కు ఇద్దరు నాయకులకు పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నేతలు, మండల స్థాయి నేతలతో సమన్వయ బాధ్యతలు అప్పగించారు. టీడీపీ శ్రేణులకు, ప్రజలకు స్థానికి ఎన్నికలకు సంబంధించి న్యాయ సలహాలు, సహకారం అందించేందుకు పది మంది సభ్యులతో లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేశారు. వీళ్లు 24 గంటలూ వారు అందుబాటులో ఉండాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీలతో పార్టీ అనుచరులకు అందుబాటులో ఉండి వైసీపీపై పోరాడాలన్నది చంద్రబాబు వ్యూహంగా టీడీపీ నేతలు చెబుతున్నారు.

  రాష్ట్ర ఎన్నికల కమిటీ : 1. కింజరాపు అచ్చెన్నాయుడు 2. యనమల రామకృష్ణుడు 3. నారా లోకేష్‌ 4. వర్ల రామయ్య 5. కళా వెంకట్రావు 6. సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి 7. కాల్వ శ్రీనివాసులు 8. ఎన్‌.ఎమ్‌.డి ఫరూక్‌ 9. డోలా బాల వీరాంజనేయస్వామి 10. బీదా రవిచంద్ర 11. బోండా ఉమామహేశ్వరరావు

  ఎక్స్‌ అఫిషియో సభ్యులు : 1. టి.డి.జనార్థన్‌ 2. పి.అశోక్‌ బాబు 3. గురజాల మాల్యాద్రి 4. మద్దిపాటి వెంకటరాజుఎన్నికల సమన్వయ కమిటీ : 1. కింజరాపు అచ్చెన్నాయుడు 2. నారా లోకేష్‌ 3. టి.డి జనార్థన్‌  4. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ 5. గన్ని కృష్ణ 6. మద్ది పాటి వెంకటరాజు 7. చింతకాయల విజయ్‌

  కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ( న్యాయ సలహాలు, సూచనల కొరకు)

  1. వర్ల రామయ్య    2.  గన్ని కృష్ణ 3. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌

  జోన్‌ -1 (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, అనకాపల్లి)

  సమన్వయ కర్తలు : బుద్ధా వెంకన్న, దువ్వారపు రామారావు

  జోన్‌ -2  ( కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు)

  సమన్వయ కర్తలు : మంతెన సత్యనారాయణ రాజు, పంచుమర్తి అనురాధ

  జోన్‌ - 3  (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల)

  సమన్వయ కర్తలు : బత్యాల చెంగల్రాయుడు, పర్చూరు అశోక్‌ బాబు

  జోన్‌ - 4 (ఒంగోలు, నెల్లూరు, తిరుపతి , చిత్తూరు, రాజంపేట)సమన్వయకర్తలు : అనగాని సత్యప్రసాద్‌, గునుపాటి దీపక్‌ రెడ్డి

  జోన్‌- 5 (కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, హిందూపురం)

  సమన్వయకర్తలు : ఎన్‌.అమర్నాథ్‌ రెడ్డి, ద్వారపురెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి

  ఇదే విధంగా పార్లమెంటు నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం, మండల స్థాయిలో సమన్వయకర్తలు, న్యాయ సలహాదారులు ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కార్యక్రమాల కమిటీ ఇన్‌ఛార్జ్‌ మద్దిపాటి వెంకటరాజు ఓ ప్రకటనలో తెలిపారు.
  Published by:Hasaan Kandula
  First published:

  అగ్ర కథనాలు