Home /News /politics /

TDP CHIEF CHANDRABABU NAIDU SENSATIONAL COMMENTS ON MEGASTAR CHIRNJEEVI NGS

Chandra Babu: చిరంజీవి వల్లే సీఎం కాలేకపోయాను.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

Chandrababu Naidu on Chiranjeevi: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.. తనను సినిమా వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు కూడా వ్యతిరేకంగా సినిమాలు తీశారని.. అసలు చిరంజీవి వల్ల తాను సీఎం ను కాలేకపోయాను అన్నారు చంద్రబాబు.

ఇంకా చదవండి ...
    Chandra Babu on Chiranjeevi: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సినిమా వివాదం ముదిరింది. ఏపీ ప్రభుత్వానికి -టాలీవుడ్ కు గ్యాప్ పెరిగింది. సినిమా టికెట్ల ధరలను పెంచడంతో పాటు..  ప్రభుత్వమే టికెట్లను ఆన్ లైన్ లో అమ్మాలని నిర్ణయించింది. అయితే ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకాల నిర్ణయాన్ని స్వాగతించిన టాలీవుడ్ (Tollywood) పెద్దలు.. సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం..  అదనపు షోలకు అనుమతి ఇవ్వకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. పలు సందర్భాల్లో తమ అభిప్రాయం చెప్పినా.. ఏపీ ప్రభుత్వం (AP Government) మాత్రం తగ్గేదేలే అంటోంది. తాజాగా రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) సైతం ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చి.. మంత్రి పేర్ని నాని (Minster Perni Nani) తో భేటీ అయ్యారు. ఆ సమయంలో మంత్రి స్పష్టంగా తన అభిప్రాయం చెప్పేశారు. టికెట్ల రేట్ల విషయంలో చేసేది ఏమీలేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. మరోవైపు తాజాగా ప్రభుత్వం వేసిన కమిటీ సమావేశమైన ఈ అంశంపై చర్చింది. అన్ని రంగాల నుంచి అభిప్రాయాలు తీసుకుంది. ఆ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే ఈ వివాదంపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్పందించారు.

    తనను సినిమా టికెట్ల వివాదంలోకి లాగేందుకు వైసైీపీ నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అసలు తాను సినిమా ఇండస్ట్రీ సహకరించలేదన్నారు.. తాను సీఎంగా ఉన్న సమయంలో వ్యతిరేకంగా సినిమాలు చేశారని గుర్తు చేశారు. ఇక చిరంజీవి పార్టీ పెట్టకుముందు, తరువాత కూడా తనతో బాగానే ఉన్నారని.. కానీ ఆయన పార్టీ పెట్టడం వల్ల తాను ఆ సమయంలో ముఖ్యమంత్రి కాలేకపోయాను అంటూ చంద్రబాబు గతాన్ని గుర్తు చేసుకున్నారు.

    ఇదీ చదవండి : మేఘాన్ని ముద్దాడే కొండలు.. ఆ అందాలు చూడతరమా.. ఇక్కడో కాదు మన దగ్గరే

    తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యులు ముఖ్యంగా చిరంజీవి పార్టీని, సినీ పరిశ్రమను ఉద్దేశించి ఆయన కామెంట్లు ఏపీ రాజకీయవర్గాల్లోనే కాదు సినీ పరిశ్రమల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయ, సినీ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఏపీలో సినిమా టికెట్ రేట్ల వివాదంపై స్పందిస్తూ ఇలా ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. రాజకీయ పోరాటం అనేది ఆటలో ఓ భాగమన్నారు.

    ఇదీ చదవండి : సంక్రాంతి స్పెషల్ సున్నుండలు తో ఇన్ని ప్రయోజనాలా..? పిల్లలు తినొచ్చా..?

    జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా టిక్కెట్ల గురించి మాట్లాడే ముఖ్యమంత్రి.. భవన నిర్మాణంపై మాట్లాడరని విమర్శించారు. సొంత సిమెంట్ కంపెనీ ఉంది కాబట్టి ఇష్టానుసారం ధరలు పెంచుకుంటున్నారని ఆరోపించారు. నిన్న-మొన్న కూడా భారతీ సిమెంట్ ధరలు పెంచుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు జగన్ రెడ్డి పీడితులే అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో సంక్రాంతి శోభ లేక కళ తప్పిందని వాపోయారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, AP News, AP Politics, Chandrababu naidu, Chiranjeevi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు