టీఆర్ఎస్‌తో కలిసి పని చేయడంపై చంద్రబాబు ఏమన్నారంటే...

ప్రస్తుతం జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన టీడీపీ అధినేత చంద్రబాబు... పలు ఇతర ప్రాంతీయ పార్టీలను కూడా కాంగ్రెస్ కూటమిలోకి తీసుకొచ్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

news18-telugu
Updated: May 17, 2019, 7:19 PM IST
టీఆర్ఎస్‌తో కలిసి పని చేయడంపై చంద్రబాబు ఏమన్నారంటే...
చంద్రబాబు, కేసీఆర్ (File)
news18-telugu
Updated: May 17, 2019, 7:19 PM IST
కేంద్రంలో ఇటు కాంగ్రెస్, అటు బీజేపీకి ఈ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో మెజార్టీ వచ్చే అవకాశం లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలకు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రాంతీయ పార్టీల మద్దతు కీలకం కానుంది. ప్రస్తుతం జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన టీడీపీ అధినేత చంద్రబాబు... పలు ఇతర ప్రాంతీయ పార్టీలను కూడా కాంగ్రెస్ కూటమిలోకి తీసుకొచ్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయస్థాయిలో టీఆర్ఎస్‌లో కలిసి పని చేసే అంశంపై చంద్రబాబు స్పందించారు.

చంద్రగిరి రీపోలింగ్ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన చంద్రబాబు... అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జాతీయస్థాయిలో టీఆర్ఎస్‌లో కలిసి పని చేస్తారా అని కొందరు ఆయనను ప్రశ్నించారు. దీనిపై తనదైశ శైలిలో సమాధానం ఇచ్చిన చంద్రబాబు... బీజేపీ, ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా ఉన్న ఎవరు తమతో కలిసి వచ్చినా వారితో కలిసి పని చేస్తామని అన్నారు. టీఆర్ఎస్ పేరు ఎత్తకుండా చంద్రబాబు ఈ రకంగా సమాధానం ఇవ్వడం విశేషం. కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంటే అందులో కేసీఆర్ పాత్ర కూడా ఉంటుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే టీఆర్ఎస్‌తో కలిసి పనిచేయడంపై ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడిన టీడీపీ అధినేత చంద్రబాబు... మరీ ఊహాత్మక ప్రశ్నలు వద్దని మీడియాకు సూచించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా కలుస్తామని... ఏదో ఒక పార్టీపై వివక్ష చూపించాల్సిన పనిలేదని అన్నారు.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...