గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఫిర్యాదు..

స్పీకర్ కోడెల ఆత్మహత్యకు ప్రభుత్వ వేధింపులే ప్రధాన కారణమని ఆయనకు వివరించారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: September 19, 2019, 4:15 PM IST
గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఫిర్యాదు..
చంద్రబాబు (File)
news18-telugu
Updated: September 19, 2019, 4:15 PM IST
టీడీపీ అధినేత చంద్రబాబు నేత్రుత్వంలో ఆ పార్టీ నేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యకు ప్రభుత్వ వేధింపులే ప్రధాన కారణమని ఆయనకు వివరించారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వ మూడు నెలల పాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయని, టీడీపీ నేతలపై దాడులు పెరిగాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ పోకడలపై దృష్టి పెట్టి రాష్ట్రంలో రాజకీయ దాడులు జరగకుండా చూడాలని ఆయన్ను కోరారు.గవర్నర్‌ను కలిసిన వారిలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, కళా వెంకట్రావు, నిమ్మకాయల చినరాజప్ప, అచ్చెన్నాయుడు,వర్ల రామయ్య,దేవినేని ఉమ, బుద్దా వెంకన్న, అశోక్ బాబు తదితరులు ఉన్నారు.

First published: September 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...