చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా... బీజేపీపైనే భారం

మూడేళ్లలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో... ఇప్పటి నుంచే మళ్లీ పార్టీ శ్రేణుల్లో మళ్లీ ఉత్సాహం నింపాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది.

news18-telugu
Updated: September 12, 2019, 7:29 PM IST
చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా... బీజేపీపైనే భారం
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: September 12, 2019, 7:29 PM IST
ఏపీలో అధికార వైసీపీని రాజకీయంగా ఎదుర్కోవడంతో పాటు టీడీపీని మళ్లీ బలోపేతం చేసేందుకు చంద్రబాబు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చలో ఆత్మకూరు వంటి రాజకీయ పోరాటాలకు పిలుపు ఇస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఎన్నికలకు మరో ఐదేళ్ల సమయం ఉండగా... చంద్రబాబు ఇప్పటి నుంచే రాజకీయ పోరాటాలను ఉధృతం చేయడం వెనుక అసలు కారణం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ప్లాన్ వల్లే చంద్రబాబులో కొత్త ఉత్సాహం నెలకొందనే టాక్ కూడా వినిపిస్తోంది.

దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉన్న కేంద్రం... మూడేళ్లలో తాము అనుకున్నది చేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు పెట్టి... అందులో గెలిస్తే కీలక నిర్ణయాలు తీసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మూడేళ్లలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో... ఇప్పటి నుంచే మళ్లీ పార్టీ శ్రేణుల్లో మళ్లీ ఉత్సాహం నింపాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది.

Chandrababu hope on pm modi plan,one nation one election,pm modi,amit shah,jamili elections,ap news,tdp,bjp,ysrcp,చంద్రబాబునాయుడు,ఒక దేశం ఒకే ఎన్నికలు,టీడీపీ,బీజేపీ,ప్రధాని మోదీ,అమిత్ షా,ఏపీ న్యూస్
అమిత్ షా, నరేంద్ర మోదీ


మూడేళ్లలో ఎన్నికలు వస్తే... అంతకుముందు ఆరు నెలల నుంచే రాజకీయ వాతావరణం నెలకొంటుందని చంద్రబాబు బలంగా నమ్ముతున్నట్టు సమాచారం. జమిలి ఎన్నికలపై కేంద్రం త్వరలోనే కసరత్తు మొదలుపెడుతుందని... దీనిపై వచ్చే ఏడాది పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని చంద్రబాబు తన పార్టీ సీనియర్ నేతల దగ్గర వ్యాఖ్యానించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మోదీ ప్లాన్ మీద చంద్రబాబు బాగానే ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

First published: September 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...