అమెరికాలో వీధుల్లో చంద్రబాబు.. పాప్ కార్న్ తింటూ...

ఈసందర్భంగా వారితో కలిసి నడుస్తూ అమెరికా వీధుల్లో సందడి చేశారు చంద్రబాబు. పాప్ కర్న్ తింటూ సరదాగా గడిపారు.

news18-telugu
Updated: August 2, 2019, 10:53 AM IST
అమెరికాలో వీధుల్లో చంద్రబాబు.. పాప్ కార్న్ తింటూ...
హోటల్‌లో చంద్రబాబు, భువనేశ్వరి
  • Share this:
టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉల్లాసంగా గడిపారు.  వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన చంద్రబాబు గురువారం పరీక్షలు చేయించుకున్నారు. మిన్నెసోట రాష్ట్రంలో ఉన్న మేయో క్లినిక్‌లో గురువారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు జయరామ్‌ కోమటి, సతీశ్‌ వేమన, రామ్‌ చౌదరి కొందరు ఎన్నారైలు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈసందర్భంగా వారితో కలిసి నడుస్తూ అమెరికా వీధుల్లో సందడి చేశారు చంద్రబాబు. పాప్ కర్న్ తింటూ సరదాగా గడిపారు.

అంతేకాదు తన భార్య భువనేశ్వరితో కలిసి అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో ఆయన భోజనం చేస్తున్న ఫొటో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వారు భోజనం చేస్తుండగా ఎవరో ఫొటో తీసి దానిని సోషల్ మీడియాలో పెట్టారు. ఈ ఫొటో చూసిన తెలుగు తమ్ముళ్లంతా ఆనందపడిపోతున్నారు. ఇన్నాళ్లకు కుటుంబంతో కలిసి గడిపే సమయం తమ అధినేతకు వచ్చిందంటూ కామెంట్లు పెడుతున్నారు.First published: August 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు