ఏమిటీ దారుణం.. సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్..

ఏపీలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై చంద్రబాబు స్పందించారు. రైతులను పట్టించుకోవడం లేదంటూ సీఎం జగన్ ప్రభుత్వాన్ని తప్పుపట్టిన ఆయన.. పంటల అమ్మకంపై ఆవేదన వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: May 6, 2020, 1:42 PM IST
ఏమిటీ దారుణం.. సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్..
చంద్రబాబు, జగన్
  • Share this:
ఏపీలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై చంద్రబాబు స్పందించారు. రైతులను పట్టించుకోవడం లేదంటూ సీఎం జగన్ ప్రభుత్వాన్ని తప్పుపట్టిన ఆయన.. పంటల అమ్మకంపై ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా.. మద్యం అమ్ముకునేందుకు అవకాశమిచ్చిన ప్రభుత్వం పంట విషయంలో రైతుకు భరోసా కల్పించలేకపోతుందన్నారు. ఈ సందర్భంగా కడపలో పంటను రోడ్డుపై పడేసి నిరసన తెలిపిన రైతుల గోడును ప్రస్తావించారు. ‘రైతు తన పంటను మార్కెట్లో అమ్ముకునే పరిస్థితులను ప్రభుత్వం కల్పించలేకపోతోంది. కడపజిల్లా, గొల్లపల్లి గ్రామంలో తాము కష్టపడి పండించిన కూరగాయలను రైతులు నడిరోడ్డుపైనే పారబోశారంటే ఎంత బాధాకరమైన విషయం! మద్యం అమ్మకాలకి అడ్డురాని నిబంధనలు పంట అమ్మకానికి అడ్డొస్తున్నాయా? ఏమిటీ దారుణం?’ అని ట్వీట్ చేశారు చంద్రబాబు.


First published: May 6, 2020, 1:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading