నెల్లూరులో ఆ రెండు సీట్లకు అభ్యర్థులు ఫిక్స్... చంద్రబాబు నిర్ణయం

ఈ సారి నెల్లూరు జిల్లాలో ఎలాగైనా మెరుగైన ఫలితాలు సాధించాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు... ఇందుకోసం బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికే అభ్యర్థులందరిని పేర్లను ఖరారు చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ అధినేత... తాజాగా నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థిని కూడా ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: February 8, 2019, 7:45 AM IST
నెల్లూరులో ఆ రెండు సీట్లకు అభ్యర్థులు ఫిక్స్... చంద్రబాబు నిర్ణయం
చంద్రబాబునాయుడు (ఫైల్ ఫొటో)
  • Share this:
గత అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. అయితే ఈ సారి నెల్లూరు జిల్లాలో ఎలాగైనా మెరుగైన ఫలితాలు సాధించాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు... ఇందుకోసం బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికే అభ్యర్థులందరిని పేర్లను ఖరారు చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ అధినేత... తాజాగా నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థిని కూడా ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీమంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఈ సారి నెల్లూరు రూరల్ స్థానం నుంచి బరిలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయించారని తెలుస్తోంది. ఆదాల అభ్యర్థన మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని జిల్లాకు చెందిన పార్టీ ముఖ్యనేతలకు కూడా చంద్రబాబు వివరించినట్టు సమాచారం.

ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మంత్రి నారాయణ... రాబోయే ఎన్నికల్లో నెల్లూరు అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ కారణంగానే కొన్నేళ్లుగా ఆయన నెల్లూరు సిటీపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. మంత్రిగా రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులను కలుపుకుని ముందుకు సాగుతున్నారు. చంద్రబాబుకు సన్నిహితుల్లో నారాయణ ఒకరు కావడంతో... నెల్లూరు అర్బన్ సీటు ఈ సారి ఆయనకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
First published: February 8, 2019, 7:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading