chandrababu కంటే ముందే Jaganకు అది సాధ్యమా? -ఢిల్లీకి చేరిన బోషిడికే పంచాయితీ -BJP వ్యూహమేంటి?

చంద్రబాబు ఢిల్లీ పర్యటకు వైసీపీ కౌంటర్

చంద్రబాబు ఢిల్లీ పర్యటనను ధీటుగా ఎదుర్కొనేందుకు వైసీపీ మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బాబు ఎవరినైతే కలవబోతున్నారో.. వారిని వైసీపీ నేతలు ముందుగానే కలిసో లేక లేఖ ద్వారానో ఫిర్యాదులు చేయనున్నట్లు సమాచారం..

  • Share this:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసాధారణ రచ్చకు దారితీసిన ‘బోషిడికే వివాదం’ ఇప్పుడు ఢిల్లీకి చేరింది. టీడీపీ నేత పట్టాభి ఆ పదంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను దూషించిన తర్వాత ఏపీలో తలెత్తిన పరిణామాలను ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదంగా ఆరోపించిన చంద్రబాబు.. అదే విషయాన్ని ఢిల్లీ పెద్దలకు వివరించి, ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయనున్నారు. అయితే, ఢిల్లీలో చంద్రబాబును అడుగడుగునా నిలువరించేందుకు వైసీపీ సైతం పదునైన వ్యూహంతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, చంద్రబాబు కంటే ముందుగానే జగన్ పార్టీ తన వెర్షన్ ను ఢిల్లీ పెద్దలకు వివరించగలుగుతుందా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతుండగా, అసలీ వివాదంలో బీజేపీ స్టాండ్ ఏమిటన్నది మరింత ఆసక్తికరంగా మారింది..

ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనను ధీటుగా ఎదుర్కొనేందుకు వైసీపీ మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ కేంద్రంగా వైసీపీ ఎంపీలంతా ఈ మేరకు సమాయత్తం అయ్యారని, చంద్రబాబు ఢిల్లీ కార్యకలాపాలకు ముందుగానే తమ వ్యూహాలను అమలు చేయనున్నారని, బాబు ఎవరినైతే కలవబోతున్నారో.. వారిని వైసీపీ నేతలు ముందుగానే కలిసో లేక లేఖ ద్వారానో ఫిర్యాదులు చేయనున్నట్లు సమాచారం.

KTRకు భారీ షాకిచ్చిన KCR?-ఆపరేషన్ హైద్రావతి గుట్టు రట్టు! -TRS plenary వేళ BJP ఎంపీ సంచలనం


ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ప్రధానంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలవనుండగా, బాబు కంటే ముందే వైసీపీ నేతలు తమ వెర్షన్ కథనాన్ని వినిపిస్తూ రాష్ట్రపతికే లేఖ అందించాలని నిర్ణయించుకున్నారు. దేవాలయాలపై దాడులు మొదలుకొని ఇటీవల పట్టాభి వ్యాఖ్యలు, అనంతరం టీడీపీ నిర్వహించిన దీక్షలో నేతలు చేసిన వ్యాఖ్యలు.. ఇలా జగన్ సీఎం అయిన తర్వాత ఏపీ ప్రతిష్టను దిగజార్చేందుకు అన్ని రకాలుగా చంద్రబాబు కుట్రలు పన్నారనే వాదనను వైసీపీ తన లేఖలో వినిపించనుంది.

చంద్రబాబు ఢిల్లీ పర్యటనను కౌంటర్ చేసే క్రమంలో వైసీపీ ఎత్తుకున్న మరో అంశం.. టీడీపీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు. ఏపీ ప్రతిష్టను దిగజార్చేలా, సీఎంను అసభ్యపదజాలంతో దూషించి, ఎమ్మెల్యేలు, ఎంపీలనూ టీడీపీ టార్గెట్ చేస్తోందని, ఇలాంటి నీచ వ్యూహాలు పన్నే పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఈసీకి రాసే లేఖలో వైసీపీ కోరనుంది. మూడో అంశంగా చంద్రబాబు ఎవరైతే కేంద్ర మంత్రులను కలుస్తారో.. వారికి కూడా వైసీపీ ఎంపీలు లేఖలు ఇవ్వనున్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయేలా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, సహనం కోల్పోయిన పరిస్థితుల్లోనే కొన్ని ఘటనలు జరిగాయని, కేవలం చంద్రబాబు స్వార్థరాజకీయాల వల్లే పరిస్థితి దిగజారిందని కేంద్ర మంత్రులకు వైసీపీ ఫిర్యాదు చేయనున్నట్లు నేతలు చెబుతున్నారు. కాగా,

బోషిడికే వివాదంలో ట్విస్ట్ : అందుకే జగన్ అలా చేశారు -తల్లిని తిట్టినవాళ్లకు మంత్రి పదవులు: టీడీపీ అయ్యన్నపాత్రుడు ఫైర్


ఏపీలో ఓ బూతు పదం చుట్టూ అధికార, విపక్షాల మధ్య ఇంత పెద్ద స్థాయిలో గలాటా జరుగుతోంటే, ప్రతిపక్ష స్థానం కోసం ప్రయత్నిస్తోన్న బీజేపీ మాత్రం చిన్న ఖండనతో సరిపెట్టడం చర్చనీయాంశమైంది. వైసీపీ, టీడీపీల్లో ఒకరు బలహీన పడితే ఆ స్థానం తమదేనని నమ్మడం వల్లే బీజేపీ నేతలు బోషిడికే వివాదంలోకి తలదూర్చలేదనే వాదన వినిపిస్తోంది. అయితే, ఏపీ పరిణామాలపై బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు హైకమాండ్ కు రిపోర్టులు పంపుతూనే ఉన్నారని, ఫిర్యాదులు చేసేందుకు వచ్చే చంద్రబాబు, జగన్ బృందాలకు ఏం చెప్పి పంపాలో ఢిల్లీ నేతలు ఇప్పటికే డిసైడైనట్లు కామెంట్లు వస్తున్నాయి.

అసలు చంద్రబాబు ఢిల్లీ పర్యటన జగన్ పైనో, ఏపీ సర్కారుపైనో ఫిర్యాదుల కోసం కానేకాదని వైసీపీ నేతలు అంటున్నారు. బీజేపీతో దోస్తానా కోసమే చంద్రబాబు ఢిల్లీ నాటకానికి తెరలేపారని, కేంద్రం పెద్దలను కలవడానికీ ఈ సందర్భాన్ని ఒక అవకాశంగా వాడుకుంటున్నారని, అయితే ఢిల్లీ పెద్దలెవరూ చంద్రబాబును నమ్మే పరిస్థితే ఉండదని వైసీపీ నేతలు అంటున్నారు. ‘రాష్ట్రపతి పాలన’అసాధ్యమని తెలిసి కూడా చంద్రబాబు ఢిల్లీకి పరుగులు పెట్టడంలో మతలబును ప్రజలంతా గమనిస్తున్నారని జగన్ పార్టీ నేతలు అంటున్నారు.
Published by:Madhu Kota
First published: