హోమ్ /వార్తలు /National రాజకీయం /

Andhra Pradesh: రూటు మార్చిన చంద్రబాబు.. ఇకపై నేరుగా ప్రజా పోరాటానికి సిద్ధం

Andhra Pradesh: రూటు మార్చిన చంద్రబాబు.. ఇకపై నేరుగా ప్రజా పోరాటానికి సిద్ధం

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

ఇప్పటి వరకు జూమ్ మీటింగ్ లు, వీడియో, టెలీ కాన్ఫరెన్స్ లతో కాలయాపన చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు గేరు మార్చేందుకు సిద్ధమయ్యారు. ఇకపై ప్రభుత్వ వైఫల్యాలు అందరికీ తెలిసేలా ప్రజల్లో ఉండి పోరాడాలని నిర్ణయించారు.

అన్నా రఘు, గుంటూరు ప్రతినిధి, న్యూస్18,               వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న టీడీపీ.. మళ్లీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల కొన్ని లోకల్, జాతీయ సర్వేలు వైసీపీకి వ్యతిరేకంగా వస్తున్నట్టు ప్రచారం జరుగుతుండడంతో..  ప్రభుత్వ వ్యతిరేకతపై పోరాటం చేయడానికి ఇదే సరైన సమయం అని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన పలు సూచనలు చేశారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజా సమస్యలపై చర్చించి.. వాటిపై కింది స్థాయి నుంచి పోరాటాలు చేయాలని నేతలకు సూచించారు. ఈ నెల28వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరల పెంపుపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు.  రెండోది ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపు విషయంలో పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు. సుమారు 413 కోట్ల రూపాయల డిపాజిట్ చేశామని ప్రభుత్వం చెబుతున్నా.. అవి కాంట్రాక్టర్లకు అందలేదని.. మరోవైపు కేంద్రం 1,991 కోట్ల రూపాయల నరేగా బకాయిలను విడుదల చేసినా వాటిని ఇవ్వకుండా దారిమళ్లించడాన్ని, కోర్టు ధిక్కరణకు పాల్పడడం తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని  పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు..

అలాగే రాష్ట్రంలో శాంతి భద్రత అంశం దారుణంగా ఉందన్ని.. దళితులపై దాడులు.. మహిళలపై అత్యాచారాల విషయం గట్టిగా పోరాడాలని తెలుగు దేశ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగా దళిత విద్యార్థిని రమ్య హత్య కేసు విషయంలో జాతీయ ఎస్సీ కమిషన్ రాష్ట్రానికి రానుంది. ఈ నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ తరపున అత్యాచారాలు, హత్యలు, అట్రాసిటీ చట్టం దుర్వినియోగంపై నివేదిక ఇవ్వాలని సమావేశంలో తీర్మానించారు..

అగ్రిగోల్డ్ విషయంలో బాధితులకు మొత్తం నగదు ఇవ్వాలని.. అగ్రిగోల్డ్ ఆస్తులను అండర్ వాల్యూకి ధారాదత్తం చేయకూడదని.. దశలవారీ మద్యనిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి మాట తప్పారని. నాసిరకం మద్యంతో పాటు ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని, జగన్ రెడ్డి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు.ః

కోవిడ్ నియంత్రణలో సీఎం జగన్ ఘోరంగా విఫలమయ్యారు. ఇతర రాష్ట్రాలు బాధితులకు ప్యాకేజీ ఇచ్చినా ఈ రాష్ట్రంలో ఇవ్వలేదు. కేంద్ర నిధులు, వ్యాక్సిన్ తోనే మమ అనిపించారు. కరోనాలోనూ పన్నులు, ధరలు పెంచి వేలకోట్లు భారాలు ప్రజలపై మోపారు.  ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.  ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చిన దానికన్నా ప్రజలపై మోపిన భారాలు రెట్టింపుగా ఉన్న విషయాన్ని అందరికీ తెలియచేయాలి అన్నారు.

తెచ్చిన 2 లక్షల కోట్ల అప్పు ఏమి చేశారని..? అవినీతి, దుబారా వల్ల రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చిందని.  ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి చట్టబద్ధంగా రావాల్సిన నిధులు, సాయం అందడం లేదని. జనాభా ప్రాతిపదికన వీరి సంక్షేమానికి నిధులు కేటాయించాలిని. ఇలాంటి విషయాలపై ప్రజల్లో ఉండి పోరాటం చేయాలని అభిప్రాయపడ్డారు. అలాగే  తెలుగుదేశం పార్టీ అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కానీ సీఎం జగన్  కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచి రాజకీయ లబ్ధి పొందారన్న విషయం ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పోరాటాలు ఉండాలని నిర్ణయంచారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Chandrababu Naidu

ఉత్తమ కథలు