TDP: టీడీపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధం.. సీఎం జగన్ నాయకత్వం వహించాలంటూ చంద్రబాబు లేఖ

రాజీనామాలకు సిద్ధమైన టీడీపీ ఎంపీలు

టీడీపీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధమయ్యారా..? మరోసారి టీడీపీ కేంద్రంపై పోరాటానికి సిద్ధమవుతోందా..? తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన లేఖ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

  • Share this:
    టీడీపీ అధినేత చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సీఎం జగన్ నాయకత్వంలో ముందుకు నడించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తమ ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. అదే విషయాలను స్పష్టం చేస్తూ తాజాగా విశాఖ ఉక్కు పోరాట సమితికి చంద్రబాబు లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపేందుకు ఎలాంటి పోరాటానికైనా టీడీపీ మద్దతు ఉంటుందని.. ఉక్కు కమిటీ తీసుకునే ప్రతి పోరాటనికి పార్టీ పరంగా మద్దతు ఉంటుందని లేఖ రాశారు. ప్రధానిగా వాజ్‌పేయ్ ఉన్నప్పుడు 4 వేల కోట్ల రూపాయలకు ప్రైవేటీకరించేందుకు సిద్ధపడ్డారని చంద్రబాబు గుర్తుచేశారు. అప్పుడు ఏపీ రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఖండించండంతో నిర్ణయం ఆగిందన్నారు. ఇప్పుడు కూడా సీఎం జగన్ ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తే బాగుంటుందని.. అప్పుడే కేంద్రానికి తీవ్రత తెలుస్తుంది. అన్నారు. సీఎం జగన్ ఈ ఉద్యమాని నాయకత్వం వహిస్తే టీడీపీ కలిసి పోరాటం చేస్తుంది అన్నారు.

    ఇప్పటికే విశాఖ ఉక్కు నినాదం హస్తినలో మారుమోగుతోంది. ఉక్కు పోరాట కమిటీ సభ్యులు జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు పార్లమెంట్ లోనూ విశాఖ స్టీల్ నినాదాలు హోరెత్తుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపేయాలని.. ఇటు వైసీపీ, అటు టీడీపీ ఎంపీలు గళమెత్తుతుతున్నారు. పార్లమెంట్ కార్యక్రమాలు స్తంభించేలా చేస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం వెనక్కు తగ్గేదే లే అంటోంది. ఇప్పటికే ప్రైవేటీకరణ నిర్ణయం పూర్తైందని.. ఆ విషయంలో ఇప్పుడు వెనుకడుగు వేయలేమని స్పష్టం చేస్తోంది. అయితే ఉద్యోగుల భద్రత, ఇతర విషయాలపై చర్చించేందుకు ఉంటే సమస్య లేకుండా పరిష్కరిస్తామని చెబుతోంది..

    ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఆంధ్రా దాటి.. దేశ రాజధానికి చేరింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రైవేటీకరణ ఆగడం అన్నది దాదాపు అసాధ్యమే.. అయితే రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ ఏక తాటిపైకి వచ్చి కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే ఏదైనా ప్రయోజనం ఉంటుంది. లేదంటే రాష్ట్ర విభజన సమయంలో ఎలాంటి పరిస్థితి తలెత్తాయి.. తరువాత రాష్ట్రం ఎంతలా నష్టపోయిందో అందరికీ తెలిసిందే.. ఇప్పటికే విభజన హామీలు.. ప్రత్యేక హోదా హామీలు మరుగున పడ్డాయి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలోనూ రాజకీయ పార్టీలు చూద్దాంలే.. చేద్దాంలే అన్నట్టు వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుందనే వాదన వినిపిస్తోంది..
    Published by:Nagesh Paina
    First published: