Select Committee | శాసనమండలి సెలక్ట్ కమిటీలకు టీడీపీ, బీజేపీ సభ్యులు ఖరారయ్యారు. టీడీపీ నుంచి సభ్యుల జాబితాను ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు అందించారు. మరోవైపు బీజేపీ, పీడీఎఫ్ నుంచి కూడా సెలక్ట్ కమిటీలో ఉండే వారి పేర్లు సూచించారు.
సీఆర్డీఏ రద్దు బిల్లుపై ఏర్పాటైన సెలక్ట్ కమిటీకి ప్రతిపాదిత సభ్యులు
టీడీపీ నుంచి...
జి.దీపక్ రెడ్డి, అనంతపురం
బచ్చుల అర్జునుడు, కృష్ణా
బీద రవిచంద్ర, నెల్లూరు
గౌనివారి శ్రీనివాసులు, చిత్తూరు
బుద్దా నాగ జగదీశ్వర్ రావు, విశాఖపట్నం
బీజేపీ నుంచి సోమువీర్రాజు
పీడీఎఫ్ నుంచి ఇళ్ల వెంకటేశ్వరరావు
రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై ఏర్పాటైన సెలక్ట్ కమిటీకి ప్రతిపాదిత సభ్యులు
టీడీపీ నుంచి...
నారా లోకేశ్, గుంటూరు
అశోక్ బాబు, కృష్ణా
తిప్పేస్వామి, అనంతపురం
బీటీ నాయుడు, కర్నూలు
సంధ్యారాణి, విజయనగరం
బీజేపీ నుంచి మాధవ్
పీడీఎఫ్ నుంచి కేఎస్ లక్ష్మణరావు
రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు సీఆర్డీఏ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని శాసనమండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఆయా పార్టీలకు సంబంధించిన సభ్యుల పేర్లను సూచించాలని పార్టీలకు లేఖలు రాశారు. దీనికి స్పందించిన టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ తమ తమ సభ్యుల పేర్లను సూచించాయి. అయితే, వైసీపీ నుంచి ఇంకా ఎవరినీ ప్రతిపాదించలేదు. శాసనమండలిలో ఏదైనా సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీకి బిల్లు పెట్టిన మంత్రి చైర్మన్గా ఉంటారు. ఎనిమిది మంది సభ్యులు ఉంటారు. మండలిలో పార్టీలకు ఉన్న సంఖ్యాబలం ఆధారంగా సభ్యులను నియమిస్తారు. ఆ ప్రాతిపదికన టీడీపీ నుంచి ఐదుగురు, బీజేపీ, పీడీఎఫ్ల నుంచి ఒక్కొక్క సభ్యులు ఉంటారు. ఆయా సభ్యుల పేర్లను ఇప్పుడు పార్టీలు సూచించాయి. ఇక వైసీపీ నుంచి మాత్రమే సభ్యులను ప్రతిపాదించాల్సి ఉంది.
శాసనమండలి రద్దు తీర్మానంపై చర్చలో ప్రసంగిస్తున్న సీఎం జగన్
మరోవైపు శాసనమండలిలో తమకు ఎదురుదెబ్బ తగలడంతో ఏకంగా కౌన్సిల్ రద్దు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు శాసనసభలో తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రం ఆమోదిస్తే అప్పుడు శాసనమండలి రద్దు అవుతుంది. అయితే, మండలి రద్దు గురించి తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఇటీవల స్పష్టం చేశారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.