Home /News /politics /

TDP AP PRESIDENT KINJARAPU ATCHANNAIDU SHOCKING SAVAL TO JAGAN READY TO CLOSE PARTY NGS

Andhra Pradesh: తెలుగుదేశం పార్టీని మూసేస్తాం. జగన్ ముందు అచ్చం నాయుడి షాకింగ్ ప్రతిపాదన

తెలుగు దేశం పార్టీని మూసేస్తామంటున్న అచ్చం నాయుడి

తెలుగు దేశం పార్టీని మూసేస్తామంటున్న అచ్చం నాయుడి

తెలుగు దేశం పార్టీని మూసేస్తారా? నిజమా ఈ మాట అంటున్నది ప్రత్యర్థి పార్టీ నేతలు కాదు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు.. చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడు అచ్చం నాయుడే ఈ మాట అనడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. అయితే ఆ పని చేయాలి అంటే జగన్ కు ఓ సవాల్ విసిరారు అచ్చం నాయుడు.

ఇంకా చదవండి ...
    తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పుడు సవాళ్ల పర్వం నడుస్తోంది.  ఇటు అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మద్య సవాళ్ల పర్వం ఇంకాస్త రెట్టింపు అయ్యాయి. మొదట టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ ఈ సవాళ్ల పర్వానికి తెరలేపారు. జగన్ బాబాయ్ వైఎస్ వివేకాను తమ కుటుంబం హత్య చేయలేదని స్వయాన తిరుపతి వెంకన్నస్వామిపై ప్రమాణం చేసి చెబుతామని.. మరి జగన్ వచ్చి అదే వెంకన్న స్వామి పై తమ కుటుంబంతో ఈ హత్యకు సంబంధం లేదని ప్రమాణం చేయగలరా అంటూ సవాల్ విసిరారు. దీనీపై వైసీపీ నేతలు నేరుగా స్పందించలేదు. కానీ లోకేష్ వ్యాఖ్యలకు స్పందించేది ఏంటి అంటూ విజయసాయి రెడ్డి లాంటి వాళ్లు సెటైర్లు వేస్తున్నారు. అయితే తాజాగా కరోనా పెరుగుతున్న నేపథ్యంలో తాను ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో తిరుపతి పర్యటనను రద్దు చేసుకుంటున్నాను అంటూ లేఖ రాశారు జగన్. అయితే లోకేష్ విసిరిన సవాల్ కు సమాధానం చెప్పలేకే జగన్ తమ పర్యటనను రద్దు చేసుకున్నారు అంటూ టీడీపీ నేతలు  విమర్శిస్తున్నారు..

    టీడీపీ సవాళ్లపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పందించారు.  తిరుపతి ఉప ఎన్నికను వైసీపీ రెఫరెండంగా చూస్తోందని.. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే తమ  పార్టీకి చెందిన 21 మంది  ఎంపీలు రాజీనామా చేస్తారని.. ఒక వేళ టీడీపీ  ఓడిపోతే ఆ పార్టీ  ఎంపీలతో పాటు.. వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్న రఘురామ రాజు తో కూడా రాజీనామా చేయాలంటూ షరుతు పెట్టి సవాల్ విసిరారు.

    తాజాగా ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు మరో సవాల్ విసిరారు. ఏపీలో ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేసి.. సీఎం వైఎస్ జగన్ పాలన పై రెఫరెండంగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి.. అలా జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఓడిపోతే తమ పార్టీని మూసివేస్తామని అచ్చం నాయుడు వైసీపీకి సవాల్ విసిరారు. గూడూరు పట్టణంలోని జరిగిన మీడియా సామావేశంలో సవాల్ విసిరారు. ఈ నెల 17న తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు ముఖ్యనేతలతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తమ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్ కు విసిరిన సవాల్ స్వీకరించకుండా ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారని అన్నారు. గత జనరల్ ఎలక్షన్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వివేక హత్య కేసులో టీడీపీ హస్తం ఉన్నట్లు అనేక ఆరోపణలు చేశారని, ఆయన అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినా వాళ్ళ చిన్నాన్న హత్య కేసులో వాస్తవాలు ఎందుకు వెలుగులోకి తీసుకోలేకపోతున్నారని ప్రశ్నించారు.  సొంత బాబాయ్ హత్యకేసును పరిష్కరించలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సామాన్యులకు ఏమి న్యాయం చేస్తారని అచ్చంనాయుడు నిలదీశారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Kinjarapu Atchannaidu, Tdp, Tirupati, Tirupati Loksabha by-poll

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు