కోడెల ఆత్మహత్యపై మొదలైన రాజకీయ దుమారం

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు

కోడెల ఆత్మహత్యపై టీడీపీ, వైసీపీ పరస్పరం విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టాయి.

  • Share this:
    ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మరణంపై రాజకీయ దుమారం మొదలైంది. ఈ అంశంపై విపక్ష టీడీపీ, అధికార వైసీపీ పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. కోడెలను కేసులతో వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని... ఇందుకుగానూ ఏపీ ప్రభుత్వంపై కేసు నమోదు చేయాలని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ప్రతి రోజు కేసులతో కోడెలను మానసికంగా ఇబ్బందిపెట్టారని... వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. టీడీపీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు కూడా కోడెల ఆత్మహత్యకు ఏపీ ప్రభుత్వం వ్యహరించిన తీరే కారణమని విమర్శించారు.

    మరోవైపు ఈ అంశంపై టీడీపీ తీరును వైసీపీ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని టీడీపీ చూస్తోందని వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. కోడెల మరణాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన పనిలేదని ఆయన అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. సీనియర్ నేత చనిపోయాడనే బాధ లేకుండా టీడీపీ నేతలు వైసీపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పోస్టుమార్టం తరువాత వాస్తవాలు వెలుగులోకి వస్తాయని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

    Published by:Kishore Akkaladevi
    First published: