లోక్‌సభలో కియా రగడ... టీడీపీ వర్సెస్ వైసీపీ

సెప్టెంబర్ మొదటి వారంలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అయితే కరోనా కారణంగా ఈసారి పార్లమెంట్‌లో సీటింగ్ విధానం మారనుంది.

ఏపీలో కొనసాగుతున్న కియా తరలింపు వార్తల రగడ పార్లమెంట్‌ను తాకింది.

  • Share this:
    ఏపీలో కొనసాగుతున్న కియా తరలింపు వార్తల రగడ పార్లమెంట్‌ను తాకింది. పార్లమెంట్‌లో ఈ అంశంపై టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం దుమ్మెత్తి పోసుకున్నారు. ఈ అంశంపై ముందుగా మాట్లాడిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు... కియా పరిశ్రమ పక్క రాష్ట్రాలకు తరలిపోతుందనే అంశాన్ని లేవనెత్తారు. ఇప్పటికే అనుబంధ పరిశ్రమలను కియా వేరే రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని యోచిస్తోందని... ఇప్పుడు ప్రధాన ప్లాంట్‌ను కూడా తరలించే యోచనలో ఉందని ఆయన అన్నారు. దీనిపై మీడియాలో కథనాలు వచ్చాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని... దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

    అయితే దీనిపై వైసీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఏపీ నుంచి కియా పరిశ్రమ తరలిపోతుందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని వైసీపీ లోక్ సభాపక్షనేత మిథున్ రెడ్డి అన్నారు. దీనిపై తాను ఈ రోజు ఉదయమే కియా ఎండీతో మాట్లాడానని తెలిపారు. కొందరు కావాలనే ఈ రకమైన దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మొత్తానికి కియా పరిశ్రమ ఏపీ నుంచి తరలిపోయే అవకాశం ఉందని వచ్చిన మీడియా కథనం... వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది.
    Published by:Kishore Akkaladevi
    First published: