చంద్రబాబు మాస్టర్ ప్లాన్... టీడీపీలో ఉత్కంఠ... వైసీపీలో టెన్షన్

విశాఖలోనే పరోక్షంగా విశాఖ రాజధానిని చంద్రబాబు వ్యతిరేకించడాన్ని ఇక్కడ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపై సస్పెన్స్ నెలకొంది.

news18-telugu
Updated: February 27, 2020, 11:20 AM IST
చంద్రబాబు మాస్టర్ ప్లాన్... టీడీపీలో ఉత్కంఠ... వైసీపీలో టెన్షన్
చంద్రబాబు
  • Share this:
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ టూర్‌పై రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. విశాఖను ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న తరువాత చంద్రబాబు తొలిసారి విశాఖకు రానుండటంతో... ఆయనకు విశాఖలో ఎలాంటి అనుభవం ఎదురవుతుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. వైసీపీ చేసే ఆందోళనల సంగతి ఎలా ఉన్నా... విశాఖ వాసుల మూడ్ ఎలా ఉందనే దానిపై చంద్రబాబు పర్యటన ద్వారా టీడీపీకి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు.

అయితే విశాఖలోనే పరోక్షంగా విశాఖ రాజధానిని చంద్రబాబు వ్యతిరేకించడాన్ని ఇక్కడ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ప్రజాచైతన్య యాత్రలో భాగంగానే చంద్రబాబు విశాఖలో పర్యటిస్తున్నారని చంద్రబాబు చెబుతున్నా... ఈసారి ఆయన విశాఖ టూర్ గతంతో పోలిస్తే ఎంతో భిన్నమైనదనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ చంద్రబాబు పర్యటనకు విశాఖ వాసుల నుంచి ఎలాంటి ప్రతికూలత వ్యక్తం కాకపోతే... అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలనే నినాదాన్ని టీడీపీ మరింత ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదే నినాదాన్ని వచ్చే ఎన్నికల వరకు టీడీపీ కొనసాగించినా.. ఆశ్చర్యపోనవసరం లేదనే ప్రచారం కూడా సాగుతోంది. మరోవైపు ఈ విషయంలో టీడీపీతో పాటు వైసీపీలోనూ అంతే స్థాయిలో టెన్షన్ నెలకొందని తెలుస్తోంది. చంద్రబాబుకు విశాఖలో ఎలాంటి ఆందోళనలు ఎదురుకాకపోతే... విశాఖ వాసులు రాజధాని విషయంలో అంత ఆసక్తిగా లేరనే ప్రచారం మొదలయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మొత్తానికి విశాఖలో పర్యటిస్తున్న చంద్రబాబు...విశాఖను ఏపీ రాజధానిగా చేయడంపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Published by: Kishore Akkaladevi
First published: February 27, 2020, 11:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading