నారావారి పల్లెలో నేడు వైసీపీ, టీడీపీ సభలు... ఇక దుమారమే...

Andhra Pradesh : తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయాలు... బహుశా దేశంలోనే ఉండవేమో. రాజధానిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీని అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుంటే... టీడీపీనే టార్గెట్ చేస్తూ... వైసీపీ కూడా వ్యూహాలు రచిస్తోంది.


Updated: February 2, 2020, 9:45 AM IST
నారావారి పల్లెలో నేడు వైసీపీ, టీడీపీ సభలు... ఇక దుమారమే...
చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్
  • Share this:
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో వాతావరణం... ఇవాళ నారావారి పల్లెలో కనిపించేలా ఉంది. ఎందుకంటే అక్కడ టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్లుగా సభలు పెట్టబోతున్నాయి. మీకు తెలుసుగా... టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టిన పల్లె... నారావారిపల్లె. అది చిత్తూరు జిల్లా... చంద్రగిరిలో ఉంది. ఇప్పటికే విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనుకుంటున్న వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ... టీడీపీ చాలా ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళనలూ నిర్వహిస్తోంది. అందుకే టీడీపీకి ఒళ్లు మండేలా... వైసీపీ స్కెచ్ వేసింది. నారావారి పల్లెలోనే ఇవాళ మధ్యాహ్నం భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు ఇంటికి దగ్గర్లోనే ఈ బహిరంగ సభ ఉండబోతోంది. ప్రజాసదస్సు పేరుతో జరిపే ఈ సభకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఏడుగురు మంత్రులు రాబోతున్నారు. టీడీపీని టార్గెట్ చేస్తూ... పరిపాలనా వికేంద్రీకరణను వివరిస్తూ... నేతల ప్రసంగాలు సాగనున్నాయి.

ప్రభుత్వ రాజధాని తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ కూడా సభ నిర్వహించబోతోంది. నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర సభ నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేసుకుంటోంది. నారావారిపల్లెలో టీడీపీ సభకు ఎలాంటి సమస్యలూ ఉండవని అనుకోవచ్చు. ఐతే... అక్కడ కూడా తమకు అభిమానులు ఉన్నారనీ, తమ నిర్ణయాన్ని స్వాగతించేవారు ఉన్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అందువల్లే అక్కడే సభ నిర్వహించి... టీడీపీకి వాస్తవాల్ని చూపిస్తామని అంటున్నాయి. ఐతే... వైసీపీ వేసిన ఎత్తుగడతో అవాక్కైన టీడీపీ... తమ పట్టునిలుపుకోవడానికి అదే నారావారి పల్లెలో సభ నిర్వహించి... వైసీపీ ఎత్తుగడలు అక్కడ సాగవని చెప్పాలని చూస్తోంది.

అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకే చోట సభలు నిర్వహించాలని డిసైడైతే షాకయ్యేది, ఇబ్బంది పడేదీ పోలీసులే. శాంతిభద్రతల్ని చూసుకోవడం, ఎలాంటి అల్లర్లూ జరగకుండా చేసుకోవడం పోలీసులకు సవాలే. ఒకే రోజు, ఒకే చోట, రెండు విరుద్ధ భావాలున్న పార్టీలు సభలు నిర్వహిస్తుండటంతో... అడుగడుగునా భద్రత చర్యలు తీసుకుంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: February 2, 2020, 9:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading