ఆ విషయంలో చేతులు కలిపిన టీఆర్ఎస్, టీడీపీ

ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష తెలుగుదేశం, తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓ విషయంలో ఒక్కతాటిమీదకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం మీద పోరాటంలో ఈ రెండు పార్టీలు కలశాయి.

news18-telugu
Updated: December 4, 2019, 4:12 PM IST
ఆ విషయంలో చేతులు కలిపిన టీఆర్ఎస్, టీడీపీ
సైకిల్, కారు గుర్తులు
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష తెలుగుదేశం, తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓ విషయంలో ఒక్కతాటిమీదకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం మీద పోరాటంలో ఈ రెండు పార్టీలు కలశాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎలక్టోరల్ బాండ్స్ మీద విపక్షాలకు చెందిన పలు పార్టీలు రాజ్యసభలో ఉమ్మడిగా నోటీసు ఇచ్చాయి. 16 పార్టీలు కలసి రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి అయిన వెంకయ్యనాయుడుకు నోటీసు ఇచ్చాయి. ‘ఎన్నికల సంస్కరణలు’ అనే అశంపై ఇచ్చిన ఈ నోటీసులో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలతో పాటు టీఎంసీ, డీఎంకే, ఎండీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, శివసేన, ఎస్పీ, బీఎస్పీ, పీడీపీ, సీపీఐ, సీపీఎం కూడా సంతకాలు చేశాయి. ప్రధానంగా బ్యాలెట్ పేపర్‌ను మళ్లీ తీసుకురావాలనే డిమాండ్ మీదే ఆయా పార్టీలు ఈ నోటీసు ఇచ్చినట్టు తెలిసింది. ఎలక్టోరల్ బాండ్స్ అనేది ఓ ప్రధాన డిమాండ్ అయినప్పటికీ... బ్యాలెట్ పేపర్‌ను మళ్లీ తీసుకురావాలనేదాన్ని బలంగా వినిపించాలని నిర్ణయించాయి. అయితే, ఈ నోటీస్ ఈ వారం చర్చకు రాకపోవచ్చని, వచ్చే వారం సభ ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ అంశాన్ని త్వరగా చర్చకు తీసుకువచ్చేలా చైర్మన్ వెంకయ్యానాయుడును కలసి విజ్ఞప్తి చేయాలని కూడా నిర్ణయించాయి.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>