Home /News /politics /

TDP AND JANASENA MLAS WHO CHANGED PARTIES AFTER 2019 ASSEMBLY ELECTIONS ARE NOT GETTING IMPORTANCE IN YRCP FULL DETAILS HERE PRN BK

AP Politics: రెంటికీ చెడ్డ రేవడిలాగా మారిన ఆ ఎమ్మెల్యేలు.., వైసీపీ వారిని పట్టించుకోవడం లేదా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏ రాష్ట్రంలోనైనా అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీలు మారే జంపింగ్ జపాంగ్ లు ఉండటం సర్వసాధారణం.

    M.బాలకృష్ణ, హైదరాబాద్ ప్రతినిధి, న్యూస్18

    ఏ రాష్ట్రంలోనైనా అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీలు మారే జంపింగ్ జపాంగ్ లు ఉండటం సర్వసాధారణం. ప్రతిపక్షంలో కూర్చుకున్న పార్టీ నుంచి కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేల వరకు అధికార పార్టీలోకి వలసలు వెళ్లడం కామన్. అయితే కొందరు నేతలు పార్టీలు ఎందుకు మరామా..? అని తలలు పట్టుకుంటున్నారట. ఇటు అధికార పార్టీలో తగినంత గుర్తింపు లేక.., స్వపక్షానికి వెళ్ళలేక మల్లగుల్లాలు పడుతున్నారట. వైసీపీ ఫ్యాన్ స్పీడ్ కు ప్రతిపక్షాలు కొట్టుకు పోయాయి. అప్పటి వరకు అధికారంలో ఉన్న టీడీపీ 23 సీట్లతో సరిపెట్టుకోగా.. జనసేన పార్టీ కేవలం ఒక్కస్థానానికే పరిమితం అయింది. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే నలుగురు , జనసేన ఒకే ఒక్క ఎమ్మెల్యే వైసీపీతో చేతులు కలిపారు. గత ప్రభుత్వ హయాంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఊహించని ప్రాధాన్యత వచ్చింది. ప్రతిపక్షం నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టారు అప్పటి సీఎం చంద్రబాబు. 2019 వైసీపీ ఘన విజయం తర్వాత టీడీపీని వీడిన నలుగురు ఎమ్మెల్యేలకు అధికార పార్టీలో అనుకున్నంత ప్రాధాన్యత రాలేదని టాక్. అంతేకాదు పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడిందట.

    2019 ఎన్నికల తర్వాత టీడీపీ తరపున గెలిచిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీని వీడి వైసీపీకి షేక్ హ్యాండ్స్ ఇచ్చారు. తాము పోటీ చేసి గెలిచిన పార్టీని వీడి వైసీపీకి జై కొట్టినా ఆశించిన ఫలితం రాలేదట. టీడీపీని వీడి చంద్రబాబును, లోకేష్ ను తెగ తిట్టిపోస్తే సీఎం జగన్ తమను గుర్తించి అందలమెక్కిస్తారని భావించినా ఫలితం శూన్యమట. కానీ వారు అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి. వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలకు, సీనియర్ నేతలకే దిక్కులేనప్పుడు ఎన్నికలప్పుడు పార్టీపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసిన వారికి గుర్తింపు ఎలా దక్కుతుందనే చర్చ కూడా జరుగుతోంది.

    ఇది చదవండి: కరోనా ఫ్రీ దిశగా ఆ మూడు జిల్లాలు.. ఏపీలో కొత్తగా ఎన్ని కేసులంటే..


    ప్రతిపక్షంలో ఉండగా తమను వేధించి.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ తమ పార్టీలోకే వచ్చిన ఎమ్మెల్యేలను వైసీపీ కార్యకర్తలు తమ నేతగా అంగీకరించడం లేదు. అంతేకాకుండా వైసీపీ తరపున ఓడిన వారికి.. కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు పొసగడం లేదు. దీంతో వర్గపోరు తారాస్థాయికి చేరుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం జగన్ కూడా పార్టీ పరంగా ఆ ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీంతో 2024లో వైసీపీ టికెట్లు దక్కేదీ లేనిదీ.. గ్యారెంటీ లేదు.

    ఇది చదవండి: సిలిండర్లో గ్యాస్ కు బదులు నీళ్లు.., ఇదేం విచిత్రమో...!


    ఇక జనసేన పార్టీ తరపున తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. గెలిచిన సమయంలో జనసేనతోనే తన ప్రయాణం అంటూ... నేనే నెంబర్ వన్ అంటూ తెగ స్టేట్ మెంట్లను ఇచ్చారాయన. తీరా ఓ కేసు విషయంలో వెనక్కుతగ్గిన రాపాక.., వైసీపీ పార్టీకి చేరువైయ్యారు. జనసేన సభ్యత్వానికి రాజీనామా చేయకపోయినా... ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇవ్వకపోయినా తాను వైసీపీ ఎమ్మెల్యే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు రాపాక ఎంట్రీ ఇచ్చే సమయానికే రాజోలు వైసీపీలో గ్రూపులున్నాయి. ఇప్పుడు రాపాక బ్యాచ్ ఎంట్రీ ఇవ్వడంతో వర్గపోరు తారాస్థాయికి చేరింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Janasena party, Tdp, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు