టీడీపీ ఏజెంట్లు అలా చేయొచ్చు... ఈసీకి వైసీపీ ముఖ్యనేత లేఖ

ప్రతీకాత్మక చిత్రం

కౌంటింగ్ సందర్భంగా అధికార పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు ఫోర్జరీ 17సి ఫామ్‌లు తీసుకొచ్చి కౌంటింగ్ సూపర్‌వైజర్లతో వాదనకు దిగే అవకాశం ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

  • Share this:
    ఎన్నికల ఫలితాల కౌంటింగ్ సందర్భంగా ఏపీలోని అధికార పార్టీ గొడవలు సృష్టించే అవకాశం ఉందని వైసీపీ ముఖ్యనేత, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. కౌంటింగ్ సందర్భంగా అధికార పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు ఫోర్జరీ 17సి ఫామ్‌లు తీసుకొచ్చి కౌంటింగ్ సూపర్‌వైజర్లతో వాదనకు దిగే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ కారణంగా కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం కావొచ్చని అన్నారు. ఇలాంటి వారిపై ఈసీ క్రిమినల్ చర్యలు తీసుకోవాలనీ... ఎన్నికల అబ్జర్వర్లు అక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. కౌంటింగ్ ఏజెంట్ల అప్రూవల్ అంశంలో ఉద్దేశపూర్వకంగానే జాప్యం జరుగుతోందని అన్నారు.

    చివరి నిమిషంలో హడావిడి లేకుండా ఈ ప్రక్రియను ముందుగానే ముగించాలని ఈసీని కోరారు. కౌంటింగ్ ఏజెంట్లు అగ్గిపెట్టెలు, కత్తులు, కత్తెర్లు, వాటర్ బాటిల్స్ తీసుకురాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్ హాల్స్ దగ్గర పటిష్టమైన బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇనుప మెస్‌లు ఏర్పాటు చేయాలి. అన్ని కౌంటింగ్ కేంద్రాల దగ్గరా రాష్ట్ర పోలీసులకు బదులుగా సీఆర్‌ఫీఎఫ్ బలగాలను మొహరించాలని సూచించారు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత ఈసీపైనే ఉందని లేఖలో విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
    First published: