గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ఎదుట టీడీపీ కార్యకర్తల ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు సైతం అక్కడకు చేరుకొని ఆందోళనలు చేశారు. దీంతో ఇరువర్గాల పోటా పోటీ ధర్నాలతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో కన్నా ఇంటి ఎదుట భారీగా పోలీసులు మోహరించారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ మైదానంలో శుక్రవారం జరిగిన ‘జన్మభూమి-మావూరు’ సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును బీజేపీ శ్రేణులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం ఆందోళనకు దిగారు. విజయవాడ టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు కన్నా ఇంటి ముందు ఆందోళన చేస్తూ ప్రధాని మోదీ, కన్నా లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Politics, Bjp-tdp, Chandrababu naidu