Home /News /politics /

Tirupati By-Poll: తిరుప‌తి ఉప ఎన్నిక ప్ర‌చారానికి జూనియ‌ర్ ఎన్టీఆర్? బాబు పై ఒత్తిడి పెంచుతున్న కేడర్ ?

Tirupati By-Poll: తిరుప‌తి ఉప ఎన్నిక ప్ర‌చారానికి జూనియ‌ర్ ఎన్టీఆర్? బాబు పై ఒత్తిడి పెంచుతున్న కేడర్ ?

జూనియర్ ఎన్టీఆర్(jr ntr)

జూనియర్ ఎన్టీఆర్(jr ntr)

తిరుప‌తి (Tirupati By-Poll) లో ప్ర‌చారానికి జూనియ‌ర్ ఎన్టీఆర్ (JR.NTR) ను రంగంలోకి దించితే బాగుంటుందిని అభిప్రాయాలు వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్ర‌తిపాద‌న‌లపై బాబు సుముఖంగానే స్పందించిన‌ట్లు స‌మాచారం.

  ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ, మున్సిపాలిటి ఎన్నిక‌ల త‌రువాత ఇప్పుడు అంద‌రి దృష్ఠి తిరుప‌తి ఉప ఎన్నిక‌ల‌పై ప‌డింది. నోటిఫికేష‌న్ రాక‌ముందు నుంచే ఇక్క‌డ పార్టీ త‌మ గ్రౌండ్ వ‌ర్క్ స్టార్ట్ చేశాయి. ప్ర‌ధాన పార్టీలైన వైసీపీ,టీడీపీ, బిజేపీలు ఇక్క‌డ ఎలాగైనా త‌మ ప‌ట్టు నిలుపుకోవాల‌ని వ్యూహాలు ర‌చిస్తున్నాయి. పంచాయితీ, మున్సిపల్ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఫ‌లితాల‌తో మంచి జోష్ లో ఉంటే.., ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ చ‌రిత్ర‌లో రాని ఈ ఫ‌లితాల‌తో చంద్ర‌బాబు అండ్ కోం ఇక్క‌డైన త‌మ ఉనికి కాపాడుకోవాల‌ని ఆలోచ‌న‌లు చేస్తోన్న‌ట్లు తెల‌స్తోంది. జ‌న‌సేన పోటీలో ఉండి ఉంటే కాస్త ఇబ్బందిక‌ర వాతావ‌ర‌ణం ఉండేది అయితే జ‌న‌సేన బిజేపీతో పొత్తులో బాగంగా ఇక్క‌డ బ‌రిలో లేక‌పోవ‌డం ఆ పార్టికి కాస్త క‌లిసోచ్చే అంశంగా క‌నిపిస్తోంది.

  ఒక వేళ జ‌న‌సేన పోటీలో ఉంటే ఇప్పుడున్న ప‌రిస్థితిలో టిడిపికి మూడో స్థానం వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌నే వాద‌న‌లు వినిపిస్తోన్నాయి. బీజేపీ త‌మ పార్టీ అభ్య‌ర్ధినే బ‌రిలో నిల‌పాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డంలో టీడీపీ నెత్తిపై పాలు పోసిన‌ట్లైంది. దీంతో ఇక్క‌డ ఎలాగైన అధికార‌పార్టికి గ‌ట్టి పోటి ఇవ్వాల‌ని ఆ పార్టీ శ్రేణులు భావిస్తోన్నాయి. అందులో భాగంగా ఇక్క‌డ ప్ర‌చారానికి జూనియ‌ర్ ఎన్టీఆర్ ను దించాల‌ని బాబు వ‌ద్ద‌కు ప‌దులో సంఖ్య‌లో కేడ‌ర్ నుంచి ప్ర‌తిపాద‌న‌లు వ‌స్తోన్నాయి. తిరుప‌తి ఉప ఎన్నిక‌కు సంబంధించి గురువారం స్థానిక నేత‌ల‌తో చంద్ర‌బాబు నాయుడు స‌మావేశం నిర్వ‌హించిన‌ప్పుడు కూడా నేత‌ల నుంచి కేడ‌ర్ నుంచి ఇవే ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చిన‌ట్లు తెస్తోంది. ఇప్ప‌టికే పంచాయితి, మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో పార్టీ భ‌విష్య‌త్ పై నీలి నీడ‌లు క‌మ్ముకుంటున్న నేప‌థ్యంలో తిరుప‌తి ఉప ఎన్నిక‌ను ఒక మంచి అవ‌కాశంగా మార్చుకోవాల‌ని కేడ‌ర్ బాబు ముందు ప్ర‌తిపాద‌న‌లు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. అందుకే తిరుప‌తి లో ప్ర‌చారానికి జూనియ‌ర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దించితే బాగుంటుందిని అభిప్రాయాలు వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్ర‌తిపాద‌న‌లపై బాబు సుముఖంగానే స్పందించిన‌ట్లు స‌మాచారం.

  ఇదిలా ఉంటే 2009 తొమ్మిది ఎన్నిక‌ల్లో పార్టీ త‌రుపున ప్ర‌చారం చేశారు జూనీయ‌ర్ ఎన్టీఆర్ త‌న ప్ర‌చారంతో టీడీపీ అధికారంలోకి రాక‌పోయిన తాను మాత్రం ప్ర‌జ‌ల దృష్టిలో ఒక మంచి నేత అవుతాడ‌నే అభిప్రాయాన్ని క‌లిగించ‌డంలో స‌క్సెస్ అయ్యారు. 2009 ఫ‌లితాలు త‌రువాత ఆయ‌న పూర్తిగా పార్టీకి దూరమైయ్యారు. అప్ప‌టి నుంచి జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌ళ్లీ పార్టీకి ఎప్పుడు సేవ‌లు అందిస్తార‌నే అంశం టీడీపీ పునాదులు క‌దులుతున్న‌పుడ‌ల్లా వినిపిస్తూనే ఉంది. అయితే ఎన్ని సార్లు ఆయ‌న పేరు రాజ‌కీయ తెర‌పై వినిపించిన ఆయ‌న మాత్రం సున్నితంగా తిర‌స్క‌రిస్తున్నారు. త‌న క‌ట్టె క‌లే వ‌ర‌కు టీడిపీతోనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేసిన ఆయ‌న అన్ని అనుకూలిస్తే తిరుప‌తి ప్ర‌చారానికి వ‌స్తారా అనేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Jr ntr, Tirupati Loksabha by-poll

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు