• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TDP ACTIVIST ATTEMPTS SUICIDE IN FRONT OF CHANDRABABU KUPPAM TOUR

Andhra Pradesh: కుప్పం టూర్ లో అపశృతి : చంద్రబాబు ముందే కార్యకర్త ఆత్మహత్యాయత్నం: ఏం జరిగింది?

Andhra Pradesh: కుప్పం టూర్ లో అపశృతి : చంద్రబాబు ముందే కార్యకర్త ఆత్మహత్యాయత్నం: ఏం జరిగింది?

చంద్రబాబు టూర్ లో అపశ్రుతి చోటు చేసుకుంది. చంద్రబాబు ఎదురుగానే ఓ కార్యకర్త ఆత్మహత్యా యత్నం చేశాడు.. ఇంతకీ ఏం జరిగింది? అధినేత ముందే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకొచ్చింది?

చంద్రబాబు టూర్ లో అపశ్రుతి చోటు చేసుకుంది. చంద్రబాబు ఎదురుగానే ఓ కార్యకర్త ఆత్మహత్యా యత్నం చేశాడు.. ఇంతకీ ఏం జరిగింది? అధినేత ముందే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకొచ్చింది?

  • Share this:
    చంద్రబాబు కుప్పం పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. టీడీపీ అధినేతే చంద్రబాబు కాన్వాయ్ ముందే ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం కొడతనపల్లి దగ్గర చంద్రబాబు కాన్వాయ్ చేరుకుంది. భారీగా అక్కడకు చేరుకున్న నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.  ఆ ప్రాంతమంతా జై చంద్రబాబు.. జై టీడీపీ అనే నినాదాలతో మారుమోగింది. ఇంతలోనే అనుకోని సంఘటన చోటు చేసుకుంది.

    సోము అనే కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తనను వేధించారని.. ఇంకా వేధింపులకు గురి చేస్తున్నారు తట్టుకోలేకపోతున్నా అంటూ ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అక్కడ ఉన్న స్థానిక నేతలు సోము ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. సోము ఆగు మన అధినేత ఉన్నారు అన్ని చూసుకుంటారు అని ధైర్యం చెప్పారు. స్వయంగా చంద్రబాబు కూడా ఆ కార్యకర్తకు ధైర్యం చెప్పారు. వైసీపీ బెదిరింపులకు ఎవరూ భయపొడొద్దని తాను అండగా ఉంటాను అన్నారు.

    ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తరువాత ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గ పర్యటకు రావడంతో ఈ పర్యటనపై ఆసక్తి పెరిగింది. అటు స్థానిక నేతలు కొందరు చంద్రబాబు టూర్ ను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉదయం నుంచే పరిస్థితి ఉద్రిక్తంగా కనిపించింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్యే చంద్రబాబు తొలిరోజు పర్యటన కొనసాగింది.

    గుడుపల్లి మండలం కొడతనపల్లి పంచాయితీలో సర్పంచ్‌గా గెలిచిన వెంకటేష్‌ను చంద్రబాబు అభినందించారు. వైసీపీ నేతల దౌర్జన్యాలకు ఎదురొడ్డి విజయం సాధించడం అభినందనీయమన్నారు. పంచాయితీ ఎన్నికలు దౌర్జన్యాలతో జరిపించారని మండిపడ్డారు. తాము బలపరిచిన అభ్యర్థులను అన్ని విధాలా భయపెట్టారని, కుప్పంలో ఏదో సాధించామని విర్రవీగుతున్నారని మండిపడ్డారు. అన్ని గుర్తుపెట్టుకుంటున్నానని, వడ్డీతో కాదు చక్రవడ్డీతో సహా తిరిగిస్తానన్నారు. కుప్పంపై కక్ష కట్టి అన్ని విధాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఎవరిని వదిలిపెట్టనని హెచ్చరించారు.

    తాను కూడా గతంలో ఇలాగే ఉండి ఉంటే ఈ పుంగనూరు నేత అసలు ఉండేవారా అని ప్రశ్నించారు? తాను కక్ష సాధింపు చర్యలు ఎప్పుడు చేయలేదన్నారు. ఏడాదిన్నరే ఈ ప్రభుత్వం.. తరువాత జమిలి ఎన్నికలు వస్తాయని.. అప్పుడు తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. భయపెడితే భయపడడానికి ఇది పుంగనూరు, కడప కాదు.. కుప్పం ఖబడ్దార్ గుర్తుపెట్టుకోండి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తరచు కుప్పం వచ్చి సమస్యలు తెలుసుకుంటానన్నారు చంద్రబాబు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ అధికారుల పనితీరును సమీక్షిస్తానని చెప్పారు. కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులను ఒక్క సంతకంతో మాఫీ చేస్తానన్నారు. కుప్పం కార్యకర్తల కోసం ఎంతైనా ఖర్చు పెడతానని చెప్పారు.
    Published by:Nagesh Paina
    First published: