Andhra Pradesh Political News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డికి (CM Jagan Mohan Reddu)కి చెక్ పెట్టడానికి చంద్రబాబు-పవన్ కళ్యాణ్ (Chandrababu - Pawan Kalyan) ఏకమవుతున్నారని రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సింగిల్ గా సీఎం జగన్ ను ఢీ కొట్టడం అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ నేతలు కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అందుకే వచ్చే ఎన్నికల నాటికి జగన్ ను ఢీ కొట్టాలి అంటే.. చంద్రబాబు నాయుడు (Chandrababu)కు మరో తోడు అవసరమని భావిస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా సింగిల్ గా ఎదుర్కొనే అంతా బలం లేదు.
చంద్రబాబు-పవన్ కలిస్తే మాత్రం కాస్త రాజకీయం మెరుగైన పరిస్థితి ఏర్పడుతుంది. పక్కగా ప్లాన్ చేస్తే అధికారం దక్కించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే టీడీపీ-జనసేనలు పొత్తు దిశగా ముందుకెళుతున్నాయని ప్రచారం నడుస్తోంది. అయితే ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నా.. వాటితో కలిసి వెళ్లేందుకు ఏపీ బీజేపీ నేతలు ససేమిరా అంటున్నారు. టీడీపితో కలిసే ప్రసక్తే లేదంటున్నారు.
ఇదీ చదవండి : ఏపీలో 40 రూపాయలకే పెట్రోల్ ఇచ్చేవాళ్లం.. సజ్జల సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మాత్రం బీజేపీకి దగ్గర అవ్వాలనే ఆలోచనలోనే కనిపిస్తున్నారు. కానీ బీజేపీ పెద్దలు మాత్రం అందుకు సుముఖంగా లేనట్టు ప్రచారం జరుగుతోంది. తాజా పరిస్థితులు చూస్తుంటే బీజేపీ-జనసేన (BJP-janasena)పొత్తు కూడా పెటాకులు అయ్యేలా ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఏదో కేంద్రం అండ ఉంటుంది తప్ప…రాజకీయంగా పవన్ బలపడే పరిస్తితి లేదు. తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల ఫలితాలతో పవన్ ఆ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చేసింది.
ఇదీ చదవండి : ఆ ఒక్క కార్పొరేషన్ పరిస్థితి ఏంటి..? ఎన్నికలు ఎందుకు జరగడం లేదు?
బీజేపీతో ముందుకెళితే ఎన్నికల్లో రాణించడం కష్టమని పవన్ కు అర్ధమవుతుంది. అదే టీడీపీతో కలిస్తే డబుల్ డిజిట్ సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే పవన్..బాబుతో కలిసి ముందుకెళ్లాలని చూస్తున్నారు. బీజేపీ మాత్రం కలిసి రావడం లేదు. దీంతో బీజేపీని పవన్ వదిలేయడానికి సిద్ధమవుతున్నారని పొలిటికల్ టాక్.. మరోవైపు టీడీపీ-జనసేనలని కలిపేందుకు బీజేపీ సీనియర్ నేత.. గతంలో మంత్రిగా పని చేసిన ఆయన గట్టిగానే ట్రై చేస్తున్నని పొలిటికల్ గా చర్చ జరుగుతోంది.
ఇది చదవండీ: విద్యార్థి సంఘాల ముసుగులో దాడి.. విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు వద్దంటూ మంత్రి సరేష్ ఫైర్
త్వరలో జనసేనలోకి వెళ్లాలి అని చూస్తున్న సీనియర్ నేతలు సైతం.. టీడీపీతో పొత్తు ఉంటేనే జనసేన కండువా కప్పుకుంటామని అధినేతకు సంకేతాలు పంపిస్తున్నట్టు సమాచారం. కచ్చితంగా టీడీపీతో పొత్తు ఉంటుందని క్లారిటీ ఇస్తే ఇప్పటికప్పుడు జనసేనలో చేరేందుకు ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు. అందులో కొందరు వైసీపీ అధిష్టానం తీరుతో విసుగు చెందిన కొందరు నాయకులు కూడా ఉన్నట్టు సమాచారం.
ఇదీ చదవండి : మూడు అంశాల పై క్లారిటీ.. అపరిష్కృత సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు
తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ టీడీపీ-జనసేన పొత్తులు తెరపైకి వచ్చాయి. పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలు వేడుక్కుతున్నాయి. ఆచంట నియోజకవర్గంలో నాయకుల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజుకు ప్రతిపక్షాలు చెక్ పెట్టేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పెనుగొండ జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన-తెలుగుదేశం పార్టీలు కలిసి పనిచేయనున్నాయి.
ఇదీ చదవండి :ఆమ్మో మంత్రి పదవా నాకొద్దు బాబోయి.. ఎమ్మెల్యేలకు ఎందుకంత భయం
తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఆచంటలో అప్రజాస్వామిక పరిపాలన నడుస్తోందని ఆయన ఆరోపించారు. అందుకే తాము పెనుగొండలో జనసేన అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ఇస్తు్న్నట్లు తెలిపారు. అధికార వైఎస్సార్సీపీకి చెక్ పెట్టేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. పెనుగొండ జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి విజయానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామినేషన్ వెనక్కి తీసుకున్నారని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Janasena, TDP