ఏపీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం.. ఏకగ్రీవ ఎన్నిక

తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు మంత్రివర్గాల్లో పనిచేసిన అనుభవం ఉంది.

news18-telugu
Updated: June 12, 2019, 8:32 PM IST
ఏపీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం.. ఏకగ్రీవ ఎన్నిక
తమ్మినేని సీతారాం(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: June 12, 2019, 8:32 PM IST
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్ పదవికి నోటిఫికేషన్ వెలువడగా, ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఆయనను బలపరుస్తూ 30 మంది సభ్యులు మద్దతు తెలపారు. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి కేవలం ఒక నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో..తమ్మినేని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఉదయం 11 గంటలకు స్పీకర్ గా తమ్మినేని సీతారాం పదవీబాధ్యతలను చేపడతారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తమ్మినేని స్పీకర్ గా ఉండాలని సీఎం జగన్ నిర్ణయించారని చెప్పారు. శాసనసభ విలువలను కాపాడేలా ఆయన వ్యవహరిస్తారని అన్నారు. తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు మంత్రివర్గాల్లో పనిచేసిన అనుభవం ఉంది. 2004లో టీడీపీ తరఫున, 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2013లో వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019లో అక్కడే గెలుపొందారు.

First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...