అంబానీ కంటే రిచ్ అభ్యర్థి.. రూ.1.76లక్షల కోట్ల ఆస్తులు, రూ.4లక్షల కోట్ల అప్పులు

తన వద్ద రూ.లక్షా 76వేల కోట్ల క్యాష్ ఉందని, వరల్డ్ బ్యాంక్‌కు రూ.4లక్షల కోట్ల అప్పు ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

news18-telugu
Updated: April 3, 2019, 8:29 PM IST
అంబానీ కంటే రిచ్ అభ్యర్థి.. రూ.1.76లక్షల కోట్ల ఆస్తులు, రూ.4లక్షల కోట్ల అప్పులు
మోహన్ రాజ్ నామినేషన్ పత్రాలు
  • Share this:
తనకు రూ.1.76లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని, అలాగే, రూ.4లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ఓ అభ్యర్థి ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించడం సంచలనం సృష్టించింది. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహిస్తున్న ఉప ఎన్నికల్లో జె.మోహన్ రాజ్ అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా మార్చి 26వ తేదీన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అందులో తన ఆస్తులు, అప్పుల వివరాలను పొందుపరిచారు. అందులో తాను వరల్డ్ బ్యాంక్‌కు రూ.4లక్షల కోట్లు రుణం బకాయి ఉన్నట్టు స్పష్టం చేశారు.

 

తన వద్ద రూ.1.76లక్షల కోట్ల నగదు ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్న మోహన్ రాజ్


 తనపై ఒక కేసు పెండింగ్‌లో ఉందని మోహన్ రాజ్ చెప్పారు. తన వద్ద లక్షా 76వేల కోట్ల రూపాయల నగదు ఉందని ప్రకటించారు. భార్య వద్ద మాత్రం రూ.20వేలు క్యాష్ ఉందట. రూ.2.5లక్షల బంగారు ఆభరణాలు ఉన్నట్టు చెప్పారు. అదే సమయంలో తన అప్పుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు వరల్డ్ బ్యాంక్‌కు రూ.4లక్షల కోట్లు అప్పు ఉన్నట్టు పేర్కొన్నారు.

తాను వరల్డ్ బ్యాంక్‌కు రూ.4లక్షల కోట్ల అప్పు ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్న మోహన్ రాజ్


రూ.20 బాండ్ పేపర్ మీద ఆయన అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఎన్నికల్లో పబ్లిసిటీ కోసమే ఈ తరహాలో ఆయన రాసి ఉంటారని భావిస్తున్నారు.
First published: April 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు