Home /News /politics /

TAMILNADU LOK SABHA ELECTION 2019 WE WANT TO TEACH LESSONS TO THOSE WHO REFUSED TO GIVE LAND TO KARUNANIDHI MK STALIN

కలైంజర్‌కి 6 అడుగుల స్థలం ఇచ్చేందుకు నిరాకరించారు...స్టాలిన్ ఆవేశం

డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్

డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్

Tamilnadu Lok Sabha Election 2019 | మహానాయకుడు కరుణానిధి...ఆయన ప్రపంచ వ్యాప్తంగా తమిళులందరికీ నాయకుడు. అలాంటి వ్యక్తి సమాధి కోసం మెరీనా తీరంలో ఆరు అడుగుల స్థలం ఇచ్చేందుకు నిరాకరించిన ఎడపాడి పళనిస్వామి సర్కారుకు లోక్‌సభ ఎన్నికల్లో తమిళ ప్రజలు గుణపాఠం చెప్పాలని డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు.

ఇంకా చదవండి ...
    కరుణానిధి సమాధి కోసం ఆరు అడుగుల స్థలం ఇచ్చేందుకు నిరాకరించిన అన్నాడీఎంకే ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు గుణపాఠం నేర్పాలని డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. తమిళనాడులోని 39 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రంతో ముగియనుంది. గురువారం పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నాగపట్నం నియోకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎంకే స్టాలిన్... మహానాయకుడైన కరుణానిధి మరణానంతరం ఆయనకు కేవలం ఆరు అడుగుల స్థలం ఇచ్చేందుకు ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వం నిరాకరించిందని అసహనం వ్యక్తంచేశారు.

    ప్రపంచ వ్యాప్తంగా తమిళులందరికీ నాయకుడైన కరుణానిధి సమాధి కోసం స్థలం ఇచ్చేందుకు నిరాకరించిన ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వానికి లోక్‌సభ ఎన్నికల్లో తమిళ ప్రజలు గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. కరుణానాధి మరణానంతరం...మెరీనా తీరంలో ఆయన సమాధి కోసం భూమిని కేటాయించేందుకు అన్నాడీఎంకే సర్కారు నిరాకరించగా..చివరకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ భూమిని ఇవ్వడంపై స్పందిస్తూ స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

    మోడీ, ఎడపాడి అరాచక శక్తుల నుంచి తమిళనాడుకు విముక్తి లభించాలని కోరుకుంటున్నట్లు స్టాలిన్ చెప్పారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు 22 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించి, తమిళనాడులో అధికార పగ్గాలు సొంతం చేసుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు.

    స్కూటీపై తిరుగుతూ పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి ఎన్నికల ప్రచారం

    Published by:Janardhan V
    First published:

    Tags: DMK, Lok Sabha Election 2019, M Karunanidhi, MK Stalin, Tamil Nadu Lok Sabha Elections 2019

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు