రూ.500 లేక... నామినేషన్ వేయలేకపోయిన నేత

తమిళనాడులో ఓ స్వతంత్ర అభ్యర్థికి వాళ్ల ఆవిడ చేసిన ఓ పని షాకిచ్చింది. ఈఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా అతను నామినేషన్ వేయాలనుకున్నాడు.

news18-telugu
Updated: March 29, 2019, 8:10 PM IST
రూ.500 లేక... నామినేషన్ వేయలేకపోయిన నేత
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశమంతా ఎన్నికల సందడి కనిపిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు... మరికొన్ని రాష్ట్రాల్లో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దీంతో అన్నిచోట్ల ఎలక్షన్ హడావుడి కనిపిస్తోంది. అయితే తమిళనాడులో ఓ స్వతంత్ర అభ్యర్థికి వాళ్ల ఆవిడ చేసిన ఓ పని షాకిచ్చింది. ఈఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా అతను నామినేషన్ వేయాలనుకున్నాడు. డిపాజిట్‌గా కట్టేందుకు రూ.12,500 లను కట్టాలి. దీంతో ఆ డబ్బును కాస్త రెడీ చేసుకొని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లాడు. అయితే డబ్బు కట్టే సమయంలో అందులో రూ.500 తగ్గింది. దీంతో అతను కంగుతిన్నాడు. వెంటనే ఇంటికి ఫోన్ చేసి ... ఆరా తీశాడు. అయిత ఇంట్లో ఖర్చుల నిమిత్తం రూ.500లను తానే తీసుకున్నానని భార్చ తెలిపింది. దీంతో... చేసేదేమి లేక..నామినేషన్ వేయకుండానే ఆయన వెనుతిరిగాడు, ఈ ఘటన తమిళనాడులో జరిగింది. విల్లుపురంలో పోటీకి దిగాలని పాండూరు వాసి అరసన్ అనుకున్నాడు. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలనుకున్నాడు. అయితే... భార్య డిపాజిట్ డబ్బుల్లో రూ.500ను తీయడంతో... డబ్బు తక్కువై నామినేషన్ వేయలేకపోయాడు. అరసన్. 2014 ఎన్నికల్లోనూ కూడా అరసన్ పోటీ చేశాడు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన అప్పట్లో కేవలం 811 ఓట్లు మాత్రమే వచ్చాయి.

First published: March 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు