రాజకీయాలకు గుడ్‌బై...జయలలిత మేనకోడలు సంచలన నిర్ణయం
తమిళనాడు మాజీ సీఎం జయలలిత మేనకోడలు జే.దీప(ఫైల్ ఫోటో)
J Deepa Quits Politics | జయలలిత మేనకోడలు జే.దీప రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. తనకు కుటుంబ జీవితమే ఇష్టమని, తన భర్తతో కలిసి కుటుంబ జీవితాన్ని కొనసాగించేందుకు వీలుగా రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.
తమిళనాడు మాజీ సీఎం జయలలిత మేనకోడలు జే.దీప రాజకీయాల నుంచి వైదొలగుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జయలలిత మరణంత తర్వాత ఆమె రాజకీయ వారసత్వంపై అన్నాడీఎంకే నేతల మధ్య పోటాపోటీ నెలకొనడం తెలిసిందే. జయలలితకు నిజమైన రక్త వారసురాలు తానేనంటూ ఆమె అన్న కుమార్తె జే.దీప రాజకీయాల్లో ప్రవేశించారు. అన్నాడీఎంకే కార్యకర్తలు, జయలలిత అభిమానులు తన వైపు నిలవాలంటూ అప్పట్లో అమె పిలుపునిచ్చారు. కొన్ని మాసాల క్రితం ‘ఎంజీఆర్ అమ్మా దీపా పేరవై’ అనే రాజకీయ పార్టీని నెలకొల్పారు.
ఈ నేపథ్యంలో తాను రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు జే.దీప మంగళవారం ప్రకటించారు. తనకంటూ ఓ కుటుంబం ఉందని, తనకు రాజకీయాలకంటే కుటుంబమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. భర్తతో కలిసి కుటుంబ జీవితాన్ని గడపడమే తనకు ఇష్టమని, అందుకే రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.
రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన దీప...తన అభిమానులు, కార్యకర్తలుగా చెప్పుకుంటూ తనకు ఎవరూ ఫోన్ చేయొద్దని కోరారు. అలా ఎవరైనా ఫోన్ చేస్తే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ‘ఎంజీఆర్ అమ్మా దీపా పేరవై’ని అన్నాడీఎంకేలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. తన మద్దతుదారులు అవసరమైతే అన్నాడీఎంకేలో చేరొచ్చని దీప సూచించారు.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.