TAMILNADU FORMER CM PANEER SELVAM MADE AN INTERESTING COMMENTS ON SHASHIKALA REENTRY IN AIADMK THAT PRV
Tamil Nadu: అనూహ్య మలుపులు తిరుగుతున్న తమిళనాడు రాజకీయాలు.. అన్నాడీఎంకేలోకి మళ్లీ శశికళ ?
(Image-Twitter)
తమిళనాడు (Tamil Nādu) రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీ లోకి ఆ పార్టీ బహిష్కృత నేత మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి శశికళ (Shashikala) రీ ఎంట్రీ పై పార్టీ కో ఆర్డినేటర్ మాజీ ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం (paneer Selvam) సానుకూల వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు (Tamil Nādu) రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీ లోకి ఆ పార్టీ బహిష్కృత నేత మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి శశికళ (Shashikala) రీ ఎంట్రీ పై పార్టీ కో ఆర్డినేటర్ మాజీ ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం (paneer Selvam) సానుకూల వ్యాఖ్యలు చేశారు. శశికళను తిరిగి పార్టీలో చేర్చుకోవడంపై పార్టీ హైకమాండ్ (party high command) చర్చించి నిర్ణయం తీసుకుంటుందని ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) నేత ఓ పన్నీర్ సెల్వం సోమవారం అన్నారు. శశికళ తిరిగి ఏఐఏడీఎంకే లో చేరాలనుకుంటే దానిపై పార్టీ అధిష్టానం చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్న ఆయన రాజకీయాల్లో ఎవరు ఎప్పుడైనా ఏ పార్టీలో అయినా చేయవచ్చు, ఏ పార్టీ నుంచి అయినా వెళ్లిపోవచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శశికళను అన్నాడీఎంకేలో చేర్చుకునే విషయంపై సానుకూల స్పందన వ్యక్తం చేసిన పన్నీర్ సెల్వం (paneer selvam) ఈ అంశంపై పార్టీ నేతలు చర్చించాలి అంటూ కొత్త చర్చకు తెరదీశారు. కాగా, ఇప్పటికే అధికారం కోల్పోయిన ఏఐఏడీఎంకే ఇబ్బందులు ఎదుర్కుంటుంది. ఇటీవలె పళని స్వామి సన్నిహితులపై ఏసీబీ దాడులు సంచలనం సృష్టించాయి. పార్టీని బలోపేతం చేయాల్సిన అవశ్యకత ఉందని చర్చలు నడిచాయి. ఇపుడు పార్టీలో నంబర్ 2 లో ఒకరైన పన్నీర్ సానుకూల స్పందన చూసి శశికళ మళ్లీ అన్నాడీఎంకే పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని తమిళనాట చర్చించుకుంటున్నారు.
జనవరి 27న బెంగళూరులోని..
జనవరి 27న బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవించిన శశికళ అధికారికంగా విడుదలయ్యారు. పార్టీలో తన హక్కును మళ్ళీ ప్రకటించుకునేందుకు ఆమె ప్రయత్నించారు. శశికళ అన్నాడీఎంకే ‘జనరల్ సెక్రటరీ'గా తనను తాను ప్రకటించుకుంటూ ఒక ఫలకాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. పార్టీ వ్యవస్థాపకులైన ఎం.జి. రామచంద్రన్ మెమోరియల్ వద్ద ఈ ఫలకాన్ని ఆవిష్కరించిన శశికళ పై అన్నాడీఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు (police) ఫిర్యాదు చేశారు.
అన్నాడీఎంకే నేతలు ఫిర్యాదు..
అన్నాడీఎంకే శశికళపై మోసపూరితంగా ప్రకటనలు చేయడం, అసమ్మతి, శత్రుత్వం, ద్వేషాన్ని ప్రోత్సహించడం, భయాందోళన కలిగించే ఉద్దేశంతో ప్రకటనలను ప్రసారం చేయడం కోసం చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారంలో పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ పదవిపై సివిల్ కోర్టు (civil court)లో కేసు విచారణలో ఉన్నపుడు శశికళపై చర్యలు తీసుకునేందుకు వీలుండదని ఆమె న్యాయవాది (lawyer) చెప్తున్నారు.
జయలలిత మరణించినప్పుడు..
తమిళనాడులో అత్యంత శక్తివంతమైన మహిళ, అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలిత (Jayalalitha)తో శశికళకు అనుబంధం ఉంది. నాలుగు సంవత్సరాల క్రితం, చెన్నైలోని ఒక ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న జయలలిత డిసెంబర్ 5, 2016 న మరణించినప్పుడు అన్నాడీఎంకేపై శశికళ ఆధిపత్యం మొదలుపెట్టింది. అయితే అనూహ్య పరిణామాల మధ్య ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు 2017 ఫిబ్రవరి 14న సుప్రీంకోర్టు శిక్షను ఖరారు చేయడంతో శశికళ జీవితం ఒక్కసారిగా పెద్ద మలుపు తిరిగింది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.